IND VS NZ India Women Team Won Series : న్యూజిలాండ్ మహిళల జట్టుతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను మహిళల టీమ్ ఇండియా సొంతం చేసుకుంది. 2-1 తేడాతో దక్కించుకుంది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. 233 పరుగుల లక్ష్యాన్ని కేవలం 44.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
స్మృతి మంధాన సెంచరీ - టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (122 బంతుల్లో 100; 10×4) సెంచరీతో అదరగొట్టింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (63 బంతుల్లో 59*, 6 ఫోర్లు) హాఫ్ సెంచరీ పూర్తి చేసి క్రీజులో నాటౌట్‌గా నిలిచింది. యాస్తికా భాటియా (35), రోడ్రిగ్స్ (22) కీలక ఇన్నింగ్స్‌తో మెరిశారు. న్యూజిలాండ్ బౌలర్లలో రోవ్ 2 వికెట్లు తీయగా, సూఫీ డివైన్, జోనస్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 232 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బ్రూక్ హల్లిడే ( 96 బంతుల్లో 86; 9×4, 3×6) తృటిలో శతకం చేజార్చుకుంది. ప్లిమ్మర్ (39) మినహా పెద్దగా ఎవరూ అంతగా రాణించలేదు. గేజ్ (25), తహుహు (24) ఫర్వాలేదనిపించేలా ఆడారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ (3/39) వికెట్లు తీసింది. ప్రియా మిశ్రా (2/41), రేణుక సింగ్, సైమా ఠాకూర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
233 పరుగుల లక్ష్య చేధనలో టీమ్ ఇండియా ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(12) తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత యస్తికా భాటియాతో కలిసి మంధాన ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే యస్తికా భాటియా సోఫియా డివైన్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. అనంతరం క్రీజులోకి హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన ఆచితూచి ఆడారు.
కాస్త దూకుడుగా ఆడిన హర్మన్ ప్రీత్ కౌర్ 54 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. స్మృతి మంధాన 122 బంతుల్లో శతకం బాదింది. ఆ వెంటనే మంధాన ఔటవ్వగా, క్రీజులోకి జెమీమా రోడ్రిగ్స్(11) వచ్చి పెవిలియన్ చేరింది. అనంతరం తేజల్ హసాబిన్స్‌తో కలిసి హర్మన్‌ప్రీత్ కౌర్ లక్ష్యాన్ని పూర్తి చేసింది.
కోహ్లీ ఫుడ్ డైట్ ఇదే - విరాట్ మాంసాహారం తినడం ఎప్పుడు మానేశాడో తెలుసా?
వరుస పరాజయాల వేళ టీమ్ ఇండియా కీలక నిర్ణయం - జట్టులోకి యంగ్ స్టార్ పేసర్