IND VS NZ First Test : భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సి మొదటి టెస్ట్ తొలి రోజు ఆట వర్షార్పణమైన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఇప్పుడు మొదటి టెస్టు ప్రారంభమైంది. టీమ్ ఇండియా టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగింది. వన్‌డౌన్ బ్యాటర్ శుభమన్ గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌కు తుది జట్టులోకి వచ్చాడు. మూడో పేసర్ ఆకాశ్ దీప్‌ను పక్కనపెట్టి కుల్‌దీప్ యాదవ్‌ను తీసుకున్నారు. గిల్ వందశాతం ఫిట్‌గా లేకపోవడం వల్ల అతడికి రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కెప్టెన్ రోహిత్ పేర్కొన్నాడు.
తుది జట్లు
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ : టామ్ లేథమ్ (కెప్టెన్), డేవన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీ
మ్యాచ్ షెడ్యూల్ ఇలా
- తొలి సెషన్ : ఉదయం 9.15 గంటల నుంచి 11.30 గంటల వరకు జరగనుంది.
- రెండో సెషన్ : మధ్యాహ్నం 12.10 గంటల నుంచి 2.25 గంటల వరకు నిర్వహించనున్నారు.
- మూడో సెషన్ : మధ్యాహ్నం 2.45 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు జరగనుంది.
తగినంత సమయం దొరకలేదు : టామ్ లాథమ్
"ప్రతికూల వాతావరణం కారణంగా, సిద్ధం కావడానికి తగినంత సమయం దొరకలేదు. కానీ, వికెట్ చాలా సేపు కప్పబడి ఉంది. వర్షం కూడా కురిసింది. ఇలాంటి పరిస్థితుల్లో పిచ్ బౌలర్లకు సహకరిస్తుందని అనుకుంటున్నా" అని టామ్ లాథమ్ అన్నాడు. ఆశిస్తున్నాను అంటూ కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ చెప్పుకొచ్చాడు.
అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నాం : రోహిత్
"భారీ స్కోరు చేయాలనుకుంటున్నాం. అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నాం. పిచ్ మొదట బౌలర్లకు ఉపయోగపడుతుంది. కానీ, వికెట్ స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనుకుంటున్నాం. అందుకే, ముందుగా బ్యాటింగ్ చేయాలని డెసిషన్ తీసుకున్నాం." అని అన్నాడు.
మళ్లీ ఆగిన ఆట - ఆట మొదలయ్యాక 12.4 ఓవర్ దగ్గర ఉండగా మళ్లీ వర్షం మొదలైంది. దీంతో ఆటను మళ్లీ ఆపేశారు. ఆ సమయానికి టీమ్ ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్! - జట్టుకు అతడు గుడ్‌బై
ఈ భారత క్రికెటర్ల కెరీర్లో ఆ చెత్త రికార్డ్‌కు నో ప్లేస్!