ETV Bharat / sports

న్యూజిలాండ్​తో రెండో టెస్ట్​ - WTCలో అశ్విన్‌ అదిరే రికార్డ్​

భారత సీనియర్ ఆటగాడు అశ్విన్‌ ఖాతాలో అరుదైన రికార్డ్!

WTC Highest Wicket Taker Ashwin Record
WTC Highest Wicket Taker Ashwin Record (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

WTC Highest Wicket Taker Ashwin Record : భారత సీనియర్ ఆటగాడు అశ్విన్‌ ఖాతాలో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ నిలిచారు. ప్రస్తుతం న్యూజిలాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టులో 2 వికెట్లు పడగొట్టి ఈ మార్క్​ను అందుకున్నాడు అశ్విన్. ప్రస్తుతం అశ్విన్‌ 188 వికెట్లు పడగొట్టగా, నాథన్​ లైయన్ లిస్ట్‌లో 187 వికెట్లు తీశాడు. ఆ తర్వాతి స్థానాల్లో క‌మ్మిన్స్‌(175 వికెట్లు), స్టార్క్(147 వికెట్లు), బ్రాడ్(134 వికెట్లు) ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న కివీస్‌ - లంచ్ బ్రేక్ సమయానికి కివీస్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 92 పరుగులను చేసింది. డేవన్ కాన్వే (47*) అర్ధ శతకం దిశగా సాగుతున్నాడు. క్రీజులో అతడికి తోడుగా రచిన్ రవీంద్ర (5*) ఆడుతున్నాడు. ఓపెనర్, కెప్టెన్ టామ్‌ లేథమ్​ను (15) ఔట్ చేసి, భారత్‌కు తొలి వికెట్‌ అందించాడు అశ్విన్‌. లేథమ్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు.

డేవన్‌తో కలిసి విల్ యంగ్ (18) ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అశ్విన్​ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి విల్​ యంగ్ పెవిలియన్ చేరాడు. లెగ్‌ సైడ్‌పై సంధించిన బంతిని ఆడే క్రమంలో బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని బాల్​ పంత్ చేతుల్లో పడింది. భారత ఫీల్డర్లు అప్పీలు చేసినా అంపైర్‌ ఔట్‌ ప్రకటించలేదు.

షార్ట్‌ లెగ్‌లో ఉన్న సర్ఫరాజ్‌ మాత్రం కాన్ఫిడెంట్‌గా డీఆర్‌ఎస్‌ తీసుకోమని కోరడం, కోహ్లీ కూడా దానికి ఓకే చెప్పడం వల్ల కెప్టెన్‌ రోహిత్ సమీక్షకు వెళ్లాడు. రీ ప్లేలో యంగ్​ ఔట్‌ అని తేలడం వల్ల భారత క్రికెటర్లు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దీంతో సర్ఫరాజ్‌పై అందరూ ప్రశంసలు కురిపించారు.

తుది జట్లు

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్‌ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్‌ : టామ్ లేథమ్ (కెప్టెన్), డేవన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్‌ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, టిమ్‌ సౌథీ, మిచెల్ సాంట్నర్, అజాజ్ పటేల్, విలియమ్‌ ఒరోర్కీ

రెస్ట్ కాదు - సిరాజ్​ను రెండో టెస్ట్​లో తీసుకోకపోవడానికి అసలు కారణమిదే!

మూడు మార్పులతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా - కివీస్​తో రెండో టెస్ట్​ ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.