IND vs NZ 2nd Test 2024 : భారత్ - న్యూజిలాండ్ మధ్య పుణె వేదికగా జరుగుతున్న టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ 301 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 195-5తో ఉంది. ఓపెనర్ టామ్ లేథమ్ (86 పరుగులు; 133 బంతుల్లో 10x4) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు ప్రస్తుతం క్రీజులో గ్లెన్ ఫిలిప్ (9 పరుగులు), టామ్ బ్లండెల్ (30 పరుగులు) ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ 4, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 156 పరుగులకు ఆలౌటైంది. బౌలింగ్‌లో అదరగొట్టిన భారత్, బ్యాటింగ్‌లో తడబాటుకు గురైంది. 16-1 ఓవర్‌నైట్ స్కోర్‌తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా రెండో రోజు పెద్దగా రాణించలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (30 పరుగులు), శుభ్‌మన్ గిల్ (30 పరుగులు), రవీంద్ర జడేజా (38 పరుగులు) ఫర్వాలేదనిపించారు. భారీ అంచనాలతో క్రీజులోకి దిగిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (1) తీవ్రంగా నిరాశ పర్చాడు. మిచెల్ శాంట్నర్ 7 వికెట్లతో సత్తా చాటగా, గ్లెన్ ఫిలిప్ 2, టిమ్ సౌథీ 1 వికెట్ దక్కించుకున్నారు.
Stumps on Day 2
— BCCI (@BCCI) October 25, 2024
New Zealand extend their lead to 301 runs
Scorecard ▶️ https://t.co/3vf9Bwzgcd#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/uFXuaDb11y
కాగా, తొలి ఇన్నింగ్స్‌లోనే 103 పరుగుల ఆధిక్యం సంపాదించిన కివీస్, రెండో ఇన్నింగ్స్‌లోనూ పట్టు బిగిస్తోంది. ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయినా 301 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మూడో రోజు కివీస్ ఎక్కువ సమయం బ్యాటింగ్ కొనసాగితే భారత్ ముంగిట భారీ టార్గెట్ ఉంచడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ను వీలైనంత త్వరగా ఔట్ చేసి, బ్యాటింగ్‌లో రాణిస్తేనే మ్యాచ్ నెగ్గే అవకాశం ఉంటుంది.
వారెవ్వా సుందర్
తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో సత్తా చాటిన యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్, రెండో ఇన్నింగ్స్‌లోనూ అదరే ప్రదర్శన చేస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో సుందర్ నాలుగు వికెట్లు నేలకూల్చాడు. దీంతో ప్రస్తుత చెస్టులో సుందర్ వికెట్ల సంఖ్య 11కు చేరింది.
1⃣0⃣th wicket of the match for Washington Sundar! 👏 👏
— BCCI (@BCCI) October 25, 2024
He is having a brilliant game with the ball 👌 👌
Live ▶️ https://t.co/YVjSnKCtlI #TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/CZPbjhBccj
స్కోర్లు
- భారత్- 165-10 (తొలి ఇన్నింగ్స్)
- న్యూజిలాండ్- 256-10 & 198-5*
సొంతగడ్డపై భారత్ డీలా- 'పుజారా' కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్!
0,1తో చెేతులెత్తేసిన రోహిత్, కోహ్లీ - కీలక మ్యాచుల్లో కుర్రాళ్లపై భారం!