IND VS New zealand 1st Test : రీసెంట్గా శ్రీలంక టూర్లో న్యూజిలాండ్ టెస్టు సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు సిద్ధమైన ఆ జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. కానీ ఇప్పుడా న్యూజిలాండ్ జట్టుకు షాక్‌లు మీదు షాకులు వరుసగా తగులుతున్నాయి. టీమ్ ఇండియాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ ముంగిట ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు తాజాగా పేసర్ బెన్ సియర్స్ ఏకంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
మెకాలి గాయం కారణంగా బెన్ సియర్స్ సిరీస్‌కు దూరం కానున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. సియర్స్ స్థానంలో జాకబ్ డఫీని జట్టులోకి తీసుకోనున్నట్లు తెలిపింది. వాస్తవానికి శ్రీలంకతో టెస్టు సిరీస్ జరిగిన సమయంలోనే బెన్ సియర్స్ మోకాలి నొప్పితో బాగా బాధపడ్డాడు. అయితే టీమ్ ఇండియా సిరీస్ సమయానికి అతడు కోలుకుంటాడని భావించి మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. గత వారం న్యూజిలాండ్ టీమ్ భారత్‌కు వచ్చింది. కానీ సియర్స్ స్వదేశంలోనే ఉండిపోయాడు. స్కానింగ్‌లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అందుకే డాక్టర్లు అతడికి విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. దీంతో సియర్స్‌ను పక్కనపెట్టి జాకబ్ డఫీని తీసుకున్నారు. కాగా, 30 ఏళ్ల జాకబ్ ఇప్పటివరకు 6 వన్డేలు, 14 టీ20లకు ప్రాతనిథ్యం వహించాడు.
ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు - అక్టోబర్ 16న బెంగళూరు వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇకపోతే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు బెంగళూరులో వర్షాలు కురిసే అవకాశం ఉందని, భారత వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే అక్కడ మంగళవారం(అక్టోబర్ 15) ఉదయం నుంచి బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఉదయం 11:15 గంటలకు జరగాల్సిన భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ కూడూ రద్దైంది.
మ్యాచ్ జరిగే మొదటి రెండు రోజుల పాటు 70-90% వర్షాలు కురిసే అవకాశం ఉంది. మూడోరోజు 67 శాతం, నాలుగో రోజు 25 శాతం, ఐదో 40 శాతం జల్లులు కురవడానికి ఛాన్స్ ఉందట. కానీ వాస్తవానికి ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టును వైట్‌వాష్ చేసి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలని టీమ్‌ఇండియా పట్టుదలతో ఉంది. కానీ ఇప్పుడు దీనికి వరుణుడు అడ్డుపడేలా ఉన్నాడు.
భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు కివీస్ జట్టు ఇదే - టామ్ లాథమ్ (కెప్టెన్), మైఖేల్ బ్రాస్‌వెల్ (తొలి టెస్టుకు మాత్రమే), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విల్ ఓ రూర్క్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, జాకబ్ డఫీ, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి (రెండు, మూడు టెస్టులకు మాత్రమే), టిమ్ సౌథీ, విల్ యంగ్ కేన్ విలియమ్సన్.
కివీస్‌తో టెస్ట్ సిరీస్ - రోహిత్ శర్మను ఊరిస్తున్న ఆ 5 రికార్డులు