ETV Bharat / sports

బజ్​బాల్- ఇంగ్లీష్ జట్టుకు ఇప్పుడిది భారమా? వరమా?

IND VS ENG Test Series 2024 : బజ్‌బాల్, బజ్‌బాల్, బజ్‌బాల్ - గత రెండేళ్లుగా ప్రపంచ క్రికెట్లో దీని గురించి ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ఇంగ్లాండ్ టెస్టుల్లో అనుసరిస్తున్న ఈ శైలి టెస్టు క్రికెట్ రూపురేఖల్ని దాదాపుగా మార్చేసేంది. టెస్టుల్లో సంప్రదాయ శైలిలో నెమ్మదిగా ఆడడం వదిలేసి పరిమిత ఓవర్ల క్రికెట్ తరహాలో దూకుడుగా ఆడటం మొదలుపెట్టాక ఇంగ్లీష్ జట్టు సంచలన విజయాలను దక్కించుకుంది. కానీ అది అప్పుడప్పుడు మొత్తానికి తలకిందులై అసలుకే మోసం వస్తోందన్న వాదనా వినిపిస్తోంది.

బజ్​బాల్ అంటే ఏంటి? ఈ పేరు ఎలా వచ్చిందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 10:52 AM IST

IND VS ENG Test Series 2024 Bazball : టీమ్ ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్​లో క్రికెట్​ అభిమానులకు బాగా వినిపిస్తున్న పేరు 'బజ్‌బాల్'. వాస్తవానికి ఈ పేరును గత కొంతకాలంగా బాగా వింటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఇంగ్లాండ్ టెస్టుల్లో దూకుడు శైలితో ఆడడం ప్రారంభించాక దీని గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. ఈ బజ్ బాల్​తోనే ఎన్నో టీమ్​లను చిత్తు చేసింది ఇంగ్లీష్ జట్టు. కానీ టీమ్​ ఇండియాపై ఆ ప్రభావం కనపడట్లేదు. అసలీ టెస్ట్ క్రికెట్‌లో బజ్ బాల్ ఎలా వచ్చింది? దానికి అర్థం ఏంటి తెలుసుకుందాం.

బజ్‌‌బాల్ పేరు ఎలా వచ్చిందంటే? హెడ్ కోచ్ మెక్‌కల్లమ్ ముద్దు పేరు నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో యూకే ఎడిటర్ ఆండ్రూ మిల్లర్ తొలిసారి ఈ బజ్‌బాల్ పదాన్ని వినియోగించారు. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ టెస్ట్ బ్యాటింగ్ అప్రోచ్‌ను వివరిస్తూ ఈ పదాన్ని ఉపయోగించారు. .

బజ్‌బాల్ అంటే ఏంటంటే? టెస్ట్‌ క్రికెట్‌ అంటే చాలా నెమ్మదిగా సాగే ఫార్మాట్‌ అన్న సంగతి తెలిసిందే. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటర్ ఆడటం ఈ ఫార్మాట్ సహజ శైలి. అయితే ఈ టెస్టుల్లో పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రత్యర్థి ఎవరా? బౌలర్ ఎవరా? అనేది అస్సలు పట్టించుకోకుండా దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ఆడటాన్నే బజ్ బాల్​గా అభివర్ణించారు.

మొదట 2019- 2022 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ సమయంలో ఇంగ్లాండ్​ దారుణంగా విఫలమైంది. అలాగే యాషెస్ సిరీస్​తో పాటు భారత్​పైనా చిత్తుగా ఓడింది. దీంతో ఇంగ్లాండ్​ క్రికెట్ బోర్డు జట్టును ప్రక్షాళన చేసి హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్, కెప్టెన్‌గా బెన్ స్టోక్స్​ను నియమించింది. వీరిద్దరిది దూకుడుగా బ్యాటింగ్ చేసే శైలి. అలా వారిద్దరు తమ జట్టుకు దూకుడుగా ప్రదర్శించే తీరును అలవాటు చేశారు. భయం లేకుండా ఆడడం బాగా అలవాటు చేశారు. ఆఖరికి జిడ్డు బ్యాటింగ్‌ చేసే జోరూట్‌‌ కూడా సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడేలా చేసేశారు.

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో ఈ బజ్‌బాల్​ ఆటతీరును మొదలెట్టిన ఇంగ్లాండ్ జట్టు ఆ తర్వాత కూడా అదే జోరును తర్వాతి సిరీస్‌ల్లోనూ కొనసాగించింది. పాకిస్థాన్ గడ్డపై సత్తా చాటింది. యాషెస్ సిరీస్‌లోనూ ఇదే తరహా బ్యాటింగ్‌ చేసి ఆసీస్‌ను బెంబేలెత్తించింది. దీంతో క్రికెట్ ప్రేమికులు ఇంగ్లాండ్ అనుసరించే తీరుపై ప్రశంసలు కురిపించారు.

అయితే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లపై మాత్రం ఈ బజ్‌బాల్ అప్రోచ్ బాగా పని చేస్తోంది. టర్నింగ్ ట్రాక్స్ ఉన్న భారత్‌లో మాత్రం కాస్త బ్యాక్ ఫైర్ అవుతోంది. భారత్​తో జరిగిన మూడు టెస్టుల్లోనూ బజ్​బాల్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఒకరిద్దరు దూకుడుగా ఆడినా, జట్టుగా మాత్రం ఇంగ్లాండ్ విఫలమవుతోంది. దీంతో ఇప్పుడు ఇంగ్లాండ్ బజ్​బాల్​పై విమర్శలు ఎక్కువయ్యాయి. ప్రశంసించిన వాళ్లే దీన్ని విమర్శించడం ప్రారంభించారు. కాస్త చూసుకొని ఆడాల్సిందని ఇంగ్లాండ్ జట్టుకు సూచిస్తున్నారు.

విమర్శలు ఎన్ని ఎదురైనా ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్‌మెంట్‌ మాత్రం తమకు అద్భుత విజయాలు అందించిన బజ్‌బాల్ విషయంలో తగ్గేదే లేదంటోంది. సిరీస్‌లో మిగతా మ్యాచ్‌ల్లోనూ బజ్‌బాల్ శైలినే కొనసాగిస్తామని గట్టిగా చెబుతోంది. 500 టార్గెట్ ఇచ్చినా ఛేదించేందుకు సిద్ధంగా ఉండాలని మెకల్లమ్ సూచించినట్లు జట్టు సభ్యులు చెబుతున్నారు. దూకుడుగానే ఆడాలని చెప్పినట్లు తెలిపారు. చూడాలి మరి ఈ శైలి అంతిమంగా ఇంగ్లీష్ జట్టుకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో!

WPL 2024కు రంగం సిద్ధం - అమ్మాయిలు రెడీగా ఉన్నారా?

ముంబయిలో 5 గదుల అపార్ట్​మెంట్​ - యశస్వి నెట్ వర్త్ ఎంతంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.