IND VS ENG Test series: విశాఖపట్టణం టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్ 106 పరుగుల తేడాతో నెగ్గింది. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 292కే కుప్పకూలింది. జాక్ క్రాలీ (73 పరుగులు) మినహా మిగతావారెవరూ రాణించలేదు. ఇక టీమ్ఇండియా బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా 3, రవిచంద్రన్ అశ్విన్ 3, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన పేసర్ బుమ్రాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 15నుంచి రాజ్‌కోట్ వేదికగా జరగనుంది.
ఓవర్‌నైట్ స్కోర్ 67-1తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రెహాన్ అహ్మద్ (28), ఒల్లీ పోప్ (23), జో రూట్ (16), జాని బెయిర్‌స్టో (26), క్రాలీ (76) తొలి సెషన్లోనే ఔటయ్యారు. దీంతో భారత్ విజయావకాశాలు మెరుగుపర్చుకుంది. అయినప్పటికీ ఇంగ్లాండ్ దూకుడుగా ఆడి పరుగులు సాధించింది. ఇక చివర్లో బెన్ ఫోక్స్ (36), టామ్ హార్ల్టీ (36) కాసేపు పోరాడి, ఓటమి అంతరాన్ని తగ్గించారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396-10 భారీ స్కోర్ నమోదు చేసింది. యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ (209) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం ఇంగ్లాండ్ 253 పరుగులకే కుప్పకూలింది. జాక్ క్రాలీ (76) మినహా మిగతా బ్యాటర్లు ఆకట్టుకోలేదు. ఈ ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ పేసర్ బుమ్రా 6 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 255 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో మరో యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (104) సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ఇరుజట్ల స్కోర్లు:
- భారత్ తొలి ఇన్నింగ్స్- 396/10
- ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్- 253/10
- భారత్ రెండో ఇన్నింగ్స్- 255/10
- ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్- 292/10
టీమ్ఇండియాకు బిగ్ షాక్ - రెండో టెస్టులో సెంచరీ హీరోకు గాయం