IND VS ENG Fourth Test Bumrah : స్వదేశంలో మరో టెస్ట్ సిరీస్ విజయంపై కన్నేసిన టీమ్ఇండియా - ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఘన విజయం సాధించింది. ఇప్పుడు రాంచీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు రెడీ అవుతోంది. ఈ పోరులో ఎలాగైనా గెలిచి టెస్టు సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కోసం మంగళవారం(ఫిబ్రవరి 20) రాంచీకి చేరుకోనుంది. బుధవారం నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టనుంది.
అయితే ఈ రాంచీ టెస్టుకు ముందుకు టీమ్ఇండియా ఓ షాక్ తగిలింది. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోడ్ కారణంగా బుమ్రాకు నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని మేనెజ్‌మెంట్ డెసిషన్ తీసుకున్నట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో కథనం రాసుకొచ్చింది. బుమ్రా మూడో టెస్ట్ వేదికైన రాజ్‌కోట్ నుంచి నేరుగా తన స్వస్థలం అహ్మదాబాద్‌కు వెళ్లనున్నట్లు సమాచారం అందింది. ఇక ఐదో టెస్టుకు కూడా బుమ్రా అందుబాటులో ఉంటడా లేదన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. నాలుగో టెస్ట్ రిజల్ట్‌పై ఆధారపడి ఉంటుందని క్రిక్‌బజ్ పేర్కొంది.
కాగా ఇప్పటికే ఈ సిరీస్‌లో బుమ్రా తమ మ్యాజిక్‌తో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 17 వికెట్లు తీసి ఈ సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇకపోతే ఈ నాలుగో టెస్ట్‌తో యువ పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేఎల్ రాహుల్ ఎంట్రీ : ఫిట్‌నెస్ కారణంగా మూడో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్‌కు ఫిట్‌నెస్ నిరూపించుకుంటే నాలుగో మ్యాచ్‌కు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు గత రెండు టెస్టుల్లోనూ ఫెయిల్ అయిన రజత్ పటీదార్‌ను తప్పించడం ఖాయం అవుతుంది.
జైస్వాల్ డౌట్ : ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు డబుల్ సెంచరీల చేసి దూకుడు మీదున్నాడు కుర్ర ఓపెనర్ యశస్వి జైస్వాల్. అతడు రాంచీ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు వెన్ను నొప్పితో బాధపడ్డాడు. కాబట్టి అతడికి రెస్ట్ ఇచ్చి దేవదత్ పడిక్కల్‌కు ఛాన్స్ ఇవ్వొచ్చు. లేదంటే ఒకవేళ పటీదార్‌కు మరో ఛాన్స్ ఇస్తే ఓపెనర్‌గా పంపి ప్రయోగం చేయొచ్చు. లేదంటే గిల్‌నునైనా ఓపెనర్‌గా మళ్లీ ప్రమోట్ చేసే అవకాశం ఉంది. కాగా, ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది.
-
Special day, special match 🇮🇳 pic.twitter.com/1VRElABnMx
— Jasprit Bumrah (@Jaspritbumrah93) January 4, 2024
అదే మా బలం - వారికి కెప్టెన్ రోహిత్ శర్మ గట్టి కౌంటర్
ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు - ఫాస్టెస్ట్ సెంచరీతో ఆంధ్ర బ్యాటర్ విధ్వంసం