ETV Bharat / sports

చివరి ఆరు మ్యాచుల్లో నాలుగు సెంచరీలు - మూడో టెస్ట్​లో అతడు ఎంట్రీ! - టీమ్​ ఇండియా ఇంగ్లాండ్ మూడో టెస్ట్

IND Vs ENG 3rd Test Devdutt Paddikal : ఇంగ్లాండ్​తో జరగనున్న మూడో టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ప్రస్తుతం సెంచరీలు బాదుతూ మంచి ఫామ్​లో ఉన్నాడు. ఆ వివరాలు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 9:54 AM IST

IND Vs ENG 3rd Test Devdutt Paddikal : ఇంగ్లాండ్​తో ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. ఇక మూడో మ్యాచ్​ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్​కు ముందే భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మూడో టెస్ట్​లో భాగం అవ్వడం లేదని తెలిసింది. ఇప్పటికే వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్​ ప్రారంభం నుంచే విరాట్ కోహ్లీ కూడా అందుబాటులో లేదు. రవీంద్ర జడేజా ఫిట్‌నెస్‌పై కూడా అనుమానాలు మెదలుతున్నాయి. అయితే వీటన్నిటీ మధ్య టీమ్ ఇండియాకు ఓ గుడ్ న్యూస్​. దేవదత్ పడిక్కల్ ఈ రాజ్‌ కోట్ టెస్టు ద్వారా అరంగేట్రం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆరు మ్యాచుల్లో నాలుగు సెంచరీలు(Devdutt Paddikal Centuries) : ఎలాగో ఇప్పుడు దేవదత్ పడిక్కల్ మంచి ఫామ్‌లో కొనసాగుతున్నాడు. గత ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో దేవదత్ పడిక్కల్ నాలుగు శతకాలు మోగించాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి బ్యాటర్ల గైర్హాజరీ నేపథ్యంలో అతడిని జట్టులో భర్తీ చేయాలని అనుకుంటున్నారని తెలిసింది. దీంతో భారత క్రికెట్ అభిమానులు ఖుషీ ఫీలవుతున్నారు.

దేవదత్ పడిక్కల్​ ఇంగ్లాండ్ లయన్స్​పై 105 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రంజీ ట్రోఫీలోనూ పంజాబ్‌పై శతకంలో చెలరేగాడు. 103 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. అయినా అతడు అక్కడితో ఆగకుండా విజృంభిస్తూనే ఉన్నాడు. గోవాపైనా కూడా మళ్లీ శతక మార్కును దాటాడు. ఈ మ్యాచ్‌లో 103 పరుగులతో చెలరేగాడు. అనంతరం తమిళనాడుపై 151 పరుగుల

భారీ ఇన్నింగ్స్​ను ఆడాడు. అలా అతడు ప్రత్యర్థి జట్టు బౌలర్లను బెంబేలెత్తిస్తూ వారికి ఇబ్బంది కరంగా మారుతున్నాడు. అలా ప్రస్తుతం సూపర్ ఫామ్​లో ఉన్న అతడు ఇంగ్లాండ్​తో జరగనున్న రాజ్‌ కోట్ టెస్టులో అరంగేట్రం ఖాయమని భారత క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మూడో టెస్టులో అతడు బరిలోకి దిగితే ఇంగ్లాండ్​ బౌలర్లకు కష్టాలు తప్పవంటూ అభిప్రాయపడుతున్నారు.

మూడో టెస్ట్​కు కీలక మార్పులు - భరత్‌ బదులు ధ్రువ్‌- సర్ఫరాజ్​ సంగతేంటంటే ?

అండర్‌-19 వరల్డ్ కప్ : వీళ్లలో సీనియర్​ జట్టు తలుపు తట్టేదెవరో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.