ETV Bharat / sports

రాజ్​కోట్​లో భారత్ గ్రాండ్ విక్టరీ- 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చిత్తు - ind vs eng live score

Ind vs Eng 3rd Test 2024: మూడో టెస్టులో ఇంగ్లాండ్​పై భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 434 పరుగుల తేడాతో నెగ్గి సిరీస్​లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Ind vs Eng 3rd Test 2024
Ind vs Eng 3rd Test 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 4:49 PM IST

Updated : Feb 18, 2024, 5:39 PM IST

Ind vs Eng 3rd Test 2024: రాజ్​కోట్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టును 434 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 556 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 122కే కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఎవరు కూడా భారీ ఇన్నింగ్ నమోదు చేయలేదు. టెయిలెండర్ మార్క్ వుడ్ (33 పరుగులు) టాప్ స్కోరర్. టీమ్ఇండియా బౌలర్ల విజృంభనతో ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రవీంద్ర జడేజా 5, కుల్​దీప్ యాదవ్ 2, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ దక్కించుకున్నారు. దీంతో నాలుగో రోజే మ్యాచ్ ముగిసింది. ఇక 5 మ్యాచ్​ల సిరీస్​లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తేలిపోయింది. బజ్​బాల్ వ్యూహం అటుంచితే వికెట్ కాపాడుకునేందుకే ఇంగ్లాడ్ బ్యాటర్లు తీవ్రంగా కష్టపడ్డారు. భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ బెన్ డకెట్​ (4)తో ప్రత్యర్థి వికెట్ల పతనం ప్రారంభమైంది. ఇక వరుసగా జాక్‌ క్రాలే (11), ఓలీ పోప్ (3), జో రూట్ (7), జానీ బెయిర్‌స్టో (4), జో రూట్ (7), బెన్‌ స్టోక్స్ (15), రెహాన్ అహ్మద్ (0), బెన్‌ ఫోక్స్ (16), టామ్‌ హార్ట్‌లీ (16) పెలివియన్​కు క్యూ కట్టారు. ఆఖర్లో మార్క్ వుడ్ ఆరు ఫోర్లు, ఓ సిక్స్​తో మెరుపులు మెరిపించాడు. ఇక జడ్డూ అతడిని బోల్తా కొట్టించి మ్యాచ్​ను ముగించేశాడు.

అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 430/4 వద్ద డిక్లేర్డ్ చేసింది. యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ (214*), శుభ్​మన్ గిల్ (91), సర్ఫరాజ్ ఖాన్ (68*), కుల్​దీప్ యాదవ్ (27), రోహిత్ శర్మ (19) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జో రూట్, టామ్ హార్ల్టీ, రెహాన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ఇరుజట్ల స్కోర్లు

  • భారత్- తొలి ఇన్నింగ్స్‌ 445; రెండో ఇన్నింగ్స్‌ 430/4 (డిక్లేర్డ్‌)
  • ఇంగ్లాండ్‌- తొలి ఇన్నింగ్స్‌ 319/10; రెండో ఇన్నింగ్స్‌ 122/10

యశస్వి డబుల్ సెంచరీ: రైనాను గుర్తుచేసిన సర్ఫరాజ్- వీడియో వైరల్

యశస్వి @ 214- కుర్రాడి వీరబాదుడికి ఇంగ్లీష్ జట్టు హడల్

Last Updated : Feb 18, 2024, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.