Ind Vs Eng 2nd Test 2024: విశాఖపట్టణం వేదికగా భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి రోజు 336-6తో నిలిచింది. క్రీజులో యశస్వి జైశ్వాల్ (179), రవిచంద్రన్ అశ్విన్ (5) ఉన్నారు. యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ (177) భారీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. శుభ్‌మన్ గిల్ (34), శ్రేయస్ అయ్యర్ (27), రజత్ పటీదార్ (32), అక్షర్ పటేల్ (27), శ్రీకర్ భరత్ (17) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, జేమ్స్ అండర్సన్ తలో వికెట్ పడగొట్టారు.
ఫస్ట్ డే జైశ్వాల్దే: వైజాగ్ పిచ్‌పై పరుగులు చేయడానికి బ్యాటర్లు కష్టపడుతుండగా యంగ్ బ్యాటర్ జైశ్వాల్ ఒక్కడే భారీ ఇన్నింగ్స్‌తో భారత్ స్కోర్ బోర్డను ముందుకు నడిపిస్తున్నాడు. మిగతా ప్లేయర్లంతా 50 పరుగులైనా చేయకుండానే పెవిలియన్ బాట పట్టిన వేళ జైశ్వాల్ ఏకంగా పరుగులు చేయడం విశేషం. టెస్టుల్లో యశస్వికి ఇది రెండో శతకం కాగా స్వదేశంలో తొలి సెంచరీ. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ (14), అయ్యర్ ఈ ఇన్నింగ్స్‌లోనూ నిరాశ పర్చారు. అరంగేట్రం ఆటగాడు రజత్ పటీదార్ (32 పరుగులు) 72 బంతులు ఎదుర్కొని ఫర్వాలేదనిపించాడు.
సొంత గడ్డపై ఫెయిల్!: సొంత గడ్డపై శ్రీకర్ భరత్‌కు చక్కని అవకాశం వచ్చింది. కానీ భరత్ ఛాన్స్‌ను చేజార్చుకున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే వేగంగే ఆడేందుకు ప్రయత్నించిన భరత్ 17 పరుగుల వద్ద రెహన్ అహ్మద్‌కు దొరికాడు. దీంతో క్రీజును వదలక తప్పలేదు. సొంత మైదానంలో భారీ ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్‌ను భరత్ మిస్ చేసుకున్నాడు.
డెబ్యూ భళా: వీసా సమస్యలతో తొలి మ్యాచ్‌కు దూరమైన 20 ఏళ్ల షోయబ్ బషీర్‌కు రెండో టెస్టులో ఛాన్స్ వచ్చింది. అతడు ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుతంగా రాణించాడు. ఇంటర్నేషనల్ కెరీర్లో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను ఔట్ చేసి తొలి వికెట్ దక్కించుకున్నాడు. ఇక అల్రౌండర్ అక్షర్ పటేల్‌ను కూడా బషీర్ పెవిలియన్ చేర్చాడు. దీంతో తొలి రోజు బషీర్ రెండు వికెట్లు ఖాతాలో అఫీషియల్ ఎంట్రీ - రెండో టెస్టుతో రజత్ అరంగేట్రం