IND VS ENG 2024 Fifth Test : ధర్మశాల వేదికగా జరుగుతున్న టీమ్ఇండియా - ఇంగ్లాండ్ ఐదో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగుల వెనుకంజలో ఉంది. అయితే ఈ తొలి రోజు ఆటలో టీమ్ఇండియా విజృంభించి ఆడింది. ఇటు బౌలింగ్‌లో, అటు బ్యాటింగ్‌లో అదరగొట్టి పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్ ముగిసే సమయానికి వికెట్ కోల్పోయి 135 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(52*; 83 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), గిల్(26; 39 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొనసాగుతున్నారు. యశస్వి జైస్వాల్ (58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 57) మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అసలు వీరు పోటాపోటీగా బౌండరీలు బాదుతుంటే స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు విజృంభించి ఆడారు. తమ అద్భుతమైన బౌలింగ్‌లో నిప్పులు చెరుగుతూ ప్రత్యర్థి బ్యాటర్లను చిత్తుచేశారు. కల్దీప్ యాదవ్ అయితే తొలి రోజే ఇంగ్లాండ్‌ను కుప్పకూల్చాడు. ఏకంగా ఐదు వికెట్లు తీసి ఆ జట్టు 218 పరుగులకే ఆలౌట్ కావడంలో కీలకంగా వ్యవహరించాడు. 15 ఓవర్ల పాటు చేసిన బౌలింగ్‌లో 72 పరుగులు ఇచ్చి 5 వికెట్లు దక్కించుకున్నాడు.
అసలు ఇంగ్లాండ్‌కు మొదట మంచి ఆరంభమే దక్కింది. కానీ,రెండో సెషన్ నుంచి భారత్ బౌలర్లు చెలరేగిపోయారు. మంచి ఫామ్‌లో ఉన్నట్టు కనిపించిన జాక్ క్రాలీని (79 పరుగులు) కుల్దీప్ యదవ్ బౌల్డ్ చేశాడు. బెన్ డకెట్, ఓలీ పోప్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్‌లను వరుసగా పెవిలియన్‌కు పంపించేశాడు. ఇక కెరీర్లోనే మైలురాయి అయిన 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ కూడా 4 వికెట్లు పడగొట్టాడు. అలా ఈ ఇద్దరి స్పిన్ మాయాజాలానికి ఇంగ్లాండ్ చతికిలపడింది. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కించుకున్నాడు.
ఇంగ్లాండ్ ప్లేయర్స్‌లో ఓపెనర్ జాక్ క్రాలీ 79 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బెన్ డకెట్ (27 పరుగులు), జోరూట్(26 పరుగులు), జానీ బెయిర్ స్టో(29 పరుగులు) చేశారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో పాటు మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ కూడా డకౌట్ అయ్యారు.
-
Stumps on the opening day in Dharamsala! 🏔️#TeamIndia move to 135/1, trail by 83 runs.
— BCCI (@BCCI) March 7, 2024
Day 2 action will resume with Captain Rohit Sharma (52*) & Shubman Gill (26*) in the middle 💪
Scorecard ▶️ https://t.co/OwZ4YNtCbQ#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/nhUXwzACi4
ఇంగ్లాండ్‌తో ఐదో మ్యాచ్ - రికార్డ్స్ బ్రేక్ చేసిన రోహిత్, యశస్వి, కుల్దీప్
ఐపీఎల్ ముందు ధావన్ ధనాధన్ - 99 నాటౌట్ - ప్రత్యర్థులు హడల్!