Ind vs Eng 1st Test: భారత్- ఇంగ్లాండ్ తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 421/7 (110 ఓవర్ల)తో నిలిచి, 175 పరుగల లీడ్‌లో కొనసాగుతోంది. రవీంద్ర జడేజా (81 పరుగులు), అక్షర్ పటేల్ (35 పరుగులు) క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ (86 పరుగులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, శ్రీకర్ భరత్ (41 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (35) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 2, జో రూట్ 2, జాక్ లీచ్, రెహన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఓవర్‌నైట్ స్కోర్ 119-2తో గేమ్ ప్రారంభించిన టీమ్ఇండియా రెండో రోజు ఐదు వికెట్లు కోల్పోయి 302 పరుగులు జోడించింది. ఇక తొలి రోజు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌటైంది.
ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోర్ 76తో రెండో రోజు ఆట ప్రారంభించిన జైశ్వాల్ తొలి ఓవర్ 4 బంతికే ఔటయ్యాడు. కాసేపటికే శుభ్‌మన్ గిల్ (23) కూడా పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్- రాహుల్ 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత అయ్యర్ క్యాచౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో రాహుల్ కెరీర్లో 14వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సెంచరీ దిశగా సాగుతున్న రాహుల్‌ను టామ్ హార్ట్లీ వెనక్కిపంపాడు.
-
Watch out for that trademark sword celebration 😎
— BCCI (@BCCI) January 26, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Ravindra Jadeja at his best 🙌
Follow the match ▶️ https://t.co/HGTxXf7Dc6#TeamIndia | #INDvENG | @imjadeja | @IDFCFIRSTBank pic.twitter.com/2WJbTYPL1x
">Watch out for that trademark sword celebration 😎
— BCCI (@BCCI) January 26, 2024
Ravindra Jadeja at his best 🙌
Follow the match ▶️ https://t.co/HGTxXf7Dc6#TeamIndia | #INDvENG | @imjadeja | @IDFCFIRSTBank pic.twitter.com/2WJbTYPL1xWatch out for that trademark sword celebration 😎
— BCCI (@BCCI) January 26, 2024
Ravindra Jadeja at his best 🙌
Follow the match ▶️ https://t.co/HGTxXf7Dc6#TeamIndia | #INDvENG | @imjadeja | @IDFCFIRSTBank pic.twitter.com/2WJbTYPL1x
జడేజా అదుర్స్: ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్‌తో కలిసి 68 పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. భరత్ 41 పరుగులతో రాణించాడు. అతడిని జో రూట్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్ (1) రనౌట్ అయ్యాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న జడేజా, అక్షర్ పటేల్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. 155 బంతుల్లో 81 పరుగులు చేసిన జడేజా సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. మరోవైపు అక్షర్ (35) చక్కని సహకారం అందిస్తున్నాడు. రెండో రోజు చివరి మూడు బంతులను అక్షర్ 4,6,4గా మలిచి అద్భుతంగా ముగించాడు.
-
15 runs off the final over of Day 2 courtesy @akshar2026 🔥🔥
— BCCI (@BCCI) January 26, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
The Jadeja-Axar partnership now 63*-runs strong 💪
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/8AxB79zCyS
">15 runs off the final over of Day 2 courtesy @akshar2026 🔥🔥
— BCCI (@BCCI) January 26, 2024
The Jadeja-Axar partnership now 63*-runs strong 💪
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/8AxB79zCyS15 runs off the final over of Day 2 courtesy @akshar2026 🔥🔥
— BCCI (@BCCI) January 26, 2024
The Jadeja-Axar partnership now 63*-runs strong 💪
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/8AxB79zCyS
ఉప్పల్‌లో తిప్పేస్తున్న భారత స్పిన్నర్లు- రోహిత్, సిరాజ్ సూపర్ క్యాచ్