Ind vs Eng 1st Test 2024: ఉప్పల్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా స్పిన్నర్లు ఉచ్చు బిగిస్తున్నారు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ను టీమ్ఇండియా అద్భుతంగా కట్టడి చేస్తోంది. బజ్‌బాల్ వ్యూహంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు, భారత్ పిచ్‌పై పరుగులు చేయలేక టపటపా వికెట్లు కోల్పోయింది. తొలి రోజు టీ బ్రేక్ సమయానికి 58 ఓవర్లకు 215 పరుగులకు ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయింది. టీమ్ఇండియా బౌలర్లు రవిచంద్రన్ రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2, అక్షర్ పటేల్ 2, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ దక్కించుకున్నారు.
రోహిత్ వావ్: అయితే ఈ మ్యాచ్ తొలి సెషన్లో 14.4 ఓవర్ వద్ద టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆ ఓవర్లో స్ట్రైక్‌లో ఉన్న ఓల్లీ పోప్ జడేజా బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడాడు. బ్యాట్ అంచున తాకిన బంతి స్లిప్‌లోకి దూసుకెళ్లింది. అక్కడే స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ చురుగ్గా స్పందించి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు.
-
Ravindra Jadeja - #TeamIndia's spin-tastic sorcerer 🧙♂️#INDvsENG #IDFCFirstBankTestSeries #JioCinemaSports #BazBowled pic.twitter.com/2AgB97la2V
— JioCinema (@JioCinema) January 25, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ravindra Jadeja - #TeamIndia's spin-tastic sorcerer 🧙♂️#INDvsENG #IDFCFirstBankTestSeries #JioCinemaSports #BazBowled pic.twitter.com/2AgB97la2V
— JioCinema (@JioCinema) January 25, 2024Ravindra Jadeja - #TeamIndia's spin-tastic sorcerer 🧙♂️#INDvsENG #IDFCFirstBankTestSeries #JioCinemaSports #BazBowled pic.twitter.com/2AgB97la2V
— JioCinema (@JioCinema) January 25, 2024
సిరాజ్ అదరహో: అశ్విన్ బౌలింగ్ చేసిన 15 ఓవర్లో తొలి బంతిని జాక్ క్రాలీ ముందుకు వచ్చి మిడాఫ్ వైపు షాట్ ఆడాడు. 30 యార్డ్ సర్కిల్లో ఫీల్డింగ్‌లో ఉన్న మహ్మద్ సిరాజ్ చురుగ్గా స్పందించాడు. వెంటనే ముందుకు డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసి బ్యాటర్ క్రాలీ షాకై పెవిలియన్ బాట పట్టాడు.
-
Ash & Miyan combine to provide #TeamIndia's third breakthrough 🔥
— JioCinema (@JioCinema) January 25, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
🎥 Zak crawls back to the dugout as 🇮🇳 pile up the pressure. Keep watching #INDvsENG thriller LIVE only on #JioCinema, #Sports18 & #ColorsCineplex 🎬#BazBowled #JioCinemaSports #IDFCFirstBankTestSeries pic.twitter.com/KTVxpwxKkk
">Ash & Miyan combine to provide #TeamIndia's third breakthrough 🔥
— JioCinema (@JioCinema) January 25, 2024
🎥 Zak crawls back to the dugout as 🇮🇳 pile up the pressure. Keep watching #INDvsENG thriller LIVE only on #JioCinema, #Sports18 & #ColorsCineplex 🎬#BazBowled #JioCinemaSports #IDFCFirstBankTestSeries pic.twitter.com/KTVxpwxKkkAsh & Miyan combine to provide #TeamIndia's third breakthrough 🔥
— JioCinema (@JioCinema) January 25, 2024
🎥 Zak crawls back to the dugout as 🇮🇳 pile up the pressure. Keep watching #INDvsENG thriller LIVE only on #JioCinema, #Sports18 & #ColorsCineplex 🎬#BazBowled #JioCinemaSports #IDFCFirstBankTestSeries pic.twitter.com/KTVxpwxKkk
ఈ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసేసరికి టీమ్ఇండియా 23 ఓవర్లు ఆడి తొలి వికెట్‌కు 119 పరుగులు చేసింది. .యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్(70 బంతుల్లో 76; 9x4, 3x6) దూకుడుగా ఆడాడు. శుభమన్ గిల్ (14 పరుగులు) క్రీజులో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(24 పరుగులు 27 బంతులు; 3x4) ఔట్ అయ్యాడు. రోహిత్‌ను జాక్ లీచ్ ఔట్ చేశాడు. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 చేసి ఆలౌట్ అయింది.