IND vs BAN Sarfaraz Khan : టీమ్ ఇండియా యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు మళ్లీ నిరాశే మిగిలింది!. బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండో టెస్టు జట్టు నుంచి అతడిని విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. శుక్రవారం(సెప్టెంబర్ 27) నుంచి రెండో టెస్టు మొదలు కానుంది. అయితే జట్టులో స్క్వాడ్‌లో ఎలాంటి మార్పులు దాదాపుగా ఉండవని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అంటే తొలి టెస్ట్‌లో ఆడించిన తుది జట్టునే రెండో మ్యాచ్‌లోనూ బరిలోకి దింపుతారని చెప్పాయి.
ఇకపోతే వచ్చే నెల మొదటి రోజు (అక్టోబర్ 1న) ఇరానీ ట్రోఫీ ప్రారంభం కానుంది. దీంతో సర్ఫరాజ్ ఖాన్‌ను రెండో టెస్టు స్క్వాడ్‌లో నుంచి రిలీజ్ చేసి, ఆ ట్రోఫీ కోసం పంపనున్నట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయమే తీసుకుంటే రెండో టెస్ట్ భారత తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
ఇకపోతే రెండో టెస్టుకు కన్పూర్ వేదిక కానుంది. ఈ మైదానం పిచ్ పేస్‌కు అనుకూలంగా మారుస్తుందో, లేదో చూడాలి. ఒకవేళ ఫాస్ట్ బౌలింగ్‌కు సహకరించేలా పిచ్‌ను సిద్ధం చేస్తే, మొదటి టెస్టులో బరిలోకి దిగిన తుది జట్టే రెండో మ్యాచ్‌లోనూ ఆడుతుంది.
ఇరానీ ట్రోఫీలో భాగంగా అక్టోబర్ 1న రంజీ ట్రోఫీ 2023-24 ఛాంపియన్ ముంబయి, రెస్టాఫ్ ఇండియాతో పోటీ పడనుంది. అటల్ బిహారీ వాజ్‌పేయీ ఏకనా స్టేడియం వేదికగా ఈ ట్రోఫీని నిర్వహించనున్నారు. "భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సర్ఫరాజ్ విషయం గురించి నిశితంగా గమనిస్తున్నారు. రెండో టెస్ట్ మ్యాచ్ సమయానికి చివరి క్షణంలో నెట్స్‌లో ఎవరైనా గాయపడితే, ప్రధాన బ్యాటర్లకు ఫిట్‌నెస్ సమస్యలు వస్తే కచ్చితంగా సర్ఫరాజ్‌కు అవకాశం ఉంటుంది. అలా కాకపోతే మెయిన్ స్క్వాడ్ నుంచి సర్ఫరాజ్‌ను విడుదల చేస్తారు. ఇరానీ ట్రోఫీలో ఆడేందుకు అనుమతి ఇస్తారు. కాన్పూర్ నుంచి లఖ్‌నవూకు కేవలం ఓ గంట మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తుది జట్టు గురించి మ్యాచ్‌కు ముందే నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి, రెండో టెస్టు ప్రారంభం అయిన తర్వాత సర్ఫరాజ్ అక్కడి నుంచి కాన్పూర్‌కు వెళ్తారు." అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.