ETV Bharat / sports

స్పిన్​​ను భారత బ్యాటర్లు ఎదుర్కోగలరా? - బంగ్లాతో టెస్ట్​కు ముందు గంభీర్ కీలక కామెంట్స్​ - IND VS BAN Gambhir on Spin Bowling

author img

By ETV Bharat Sports Team

Published : Sep 18, 2024, 3:12 PM IST

IND VS BAN Gambhir on Spin Bowling : బంగ్లాదేశ్​తో గురువారం నుంచి జరగబోయే మొదటి టెస్టులో ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్ వస్తారని భారత హెడ్ కోచ్ గంభీర్ తెలిపాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో టీమ్ ఇండియా బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్పాడు. భారత జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉందని అభిప్రాయపడ్డాడు. ఇంకా ఏమన్నాడంటే?

source ANI
IND VS BAN Gambhir on Spin Bowling (source ANI)

IND VS BAN Gambhir on Spin Bowling : ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్ యూనిట్​నైనా భారత బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కోగలరని టీమ్ ఇండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు. టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉందని తెలిపాడు. భారత జట్టు నాణ్యమైన బ్యాటర్లను కలిగి ఉందని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్​తో టెస్ట్​ సిరీస్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంభీర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు.

వారు కొన్నాళ్లు ఆగాల్సిందే! - "భారత్‌ జట్టు ఒకప్పుడు బ్యాటర్లపైనే ఆధారపడేది. కానీ బుమ్రా, షమీ, అశ్విన్, జడేజా వంటి బౌలర్లు ఆ ముద్రను పూర్తిగా చెరిపేశారు. బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్. అతడు మ్యాచ్​ను ఏ దశలోనైనా టీమ్ ఇండియా వైపు తిప్పేయగల సమర్థుడు. అశ్విన్, జడేజాల స్పిన్ త్రయం ఒకేసారి అందుబాటులో ఉండడం టీమ్ ఇండియాకు కలిసి వస్తుంది. పంత్ విధ్వంసక బ్యాటర్‌. మంచి వికెట్ కీపర్ కూడా. అందుకే పంత్ తుది జట్టులో ఉండాలి. అలాగే ఓపెనర్ యజస్వీ కూడా పంత్​కు షాడో వికెట్ కీపర్​గా ఉంటాడు. బంగ్లాదేశ్​తో జరిగే మొదటి టెస్టులో ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం దక్కకపోవచ్చు. వారిద్దరూ టెస్టు జట్టులో స్థానం కోసం మరి కొన్నాళ్లు వేచి ఉండాల్సిందే." అని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.

బ్యాటింగ్ ఆర్డర్ ఇలా! - బంగ్లాతో జరిగే మొదటి టెస్టులో రోహిత్, జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని గంభీర్ తెలిపాడు. గిల్ నంబర్ 3లో, కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు వస్తాడని చెప్పుకొచ్చాడు. మిడిలార్డర్​లో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ ఆడుతారని స్పష్టం చేశాడు. టీమ్ ఇండియా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు. భారత్​లో పిచ్​లు గురించి చాలా మంది మాట్లాడుతున్నారని అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేటప్పుడు రెండు రోజుల్లోనే టెస్టు మ్యాచులు ముగిశాయని, వాటి గురించి ఎవరూ మాట్లాడలేదని ఎద్దేవా చేశాడు.

సీనియర్ ఆటగాళ్లతో మంచి సంబంధాలు - టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లతో తనకున్న సంబంధాలపైనా గంభీర్ స్పందించాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న చాలా మంది సీనియర్ ఆటగాళ్లతో తాను కలిసి ఆడానని, వారితో తనకు సంబంధాలు బాగున్నాయని తెలిపాడు. క్రికెటర్లు ఐపీఎల్ ఆడాలని మాత్రమే కోరుకుంటారని చాలా మంది ఆరోపిస్తుంటారు, అందులో నిజం లేదని చెప్పారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నవారంతా దేశం కోసం ఆడాలని కోరుకుంటారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ పై సిరీస్​ను గెలవడమే తమ లక్ష్యమని చెప్పాడు.

కాగా, టీమ్ ఇండియా- బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు జరిగే చెపాక్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. పేసర్లకు పెద్దగా అనుకూలించకపోవచ్చు. ఈ పిచ్ పై బుమ్రా, షమీ వంటి టీమ్ ఇండియా పేసర్లు ఏ మాత్రం రాణిస్తారనే ఆసక్తి నెలకొంది.

షెడ్యూల్ ఇదే
కాగా, భారత పర్యటనకు బంగ్లాదేశ్ రానుంది. చెన్నై వేదికగా సెప్టెంబరు 19 నుంచి 23 వరకు భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. సెప్టెంబరు 27- అక్టోబరు 1 వరకు రెండో టెస్టులో ఇరుజట్లు తలపడనున్నాయి. అక్టోబరు 6 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం అవ్వనుంది.
ధోనీపై గంభీర్​కు ఫస్ట్ ఇంప్రెషన్ ఏర్పడింది అప్పుడే! - గౌతీ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​ - Gambhir About Dhoni

'నా కన్నా నీకే ప్రత్యర్థులతో గొడవలు ఎక్కువ!'- కోహ్లీతో గంభీర్ చిట్​చాట్​ - Virat Kohli Gambhir Interview

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.