ETV Bharat / sports

'నా కన్నా నీకే ప్రత్యర్థులతో గొడవలు ఎక్కువ!'- కోహ్లీతో గంభీర్ చిట్​చాట్​ - Virat Kohli Gambhir Interview

author img

By ETV Bharat Sports Team

Published : Sep 18, 2024, 11:52 AM IST

IND VS BAN Virat Kohli Gambhir Interview : కింగ్ కోహ్లీ - గౌతం గంభీర్ ఇంటర్వ్యూ వీడియోకు సంబంధించిన ఓ చిన్న క్లిప్​ను విడుదల చేసింది బీసీసీఐ. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?

source IANS
Kohli Gambhir (source IANS)

IND VS BAN Virat Kohli Gambhir Interview : భారత హెడ్ కోచ్ గంభీర్, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయని చాలా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆన్ ఫీల్డ్​లో అయితే ఇద్దరి మధ్య వివాదం చెలరేగినట్లు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. లఖ్​నవూ మెంటార్​గా ఉన్న సమయంలో కూడా గంభీర్, ఆర్సీబీ ప్లేయరైన విరాట్ కోహ్లీకి గొడవ జరగడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విరాట్​పై గంభీర్ విమర్శలు గుప్పించేవాడు. అయితే గంభీర్ టీమ్ ఇండియా హెచ్ కోచ్​గా వచ్చిన తర్వాత పరిస్థితులు దాదాపుగా మారిపోయాయి.

సరదాగా మారిపోయిన గంభీర్, కోహ్లీ - గంభీర్ హెడ్​ కోచ్​గా జట్టుతో కలిశాక అతడికి, కోహ్లీకి మధ్య మంచి బంధం ఏర్పడింది. ఇద్దరూ కలిసి చాలాసార్లు ప్రాక్టీసు సెషన్​లో జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ కనిపించారు. గంభీర్​తో గతంలో జరిగిన ఘటనలు తమ బంధంపై ప్రభావం చూపించవని కోహ్లీ గతంలో వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా గంభీర్-కోహ్లీ మధ్య మనస్పర్థలు లేవని నిరూపించే ఓ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

గౌతీ- కింగ్ స్పెషల్ ఇంటర్వ్యూ - వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ పేరుతో నిమిషం 40 సెకన్ల నిడివి ఉన్న వీడియోను షేర్ చేసింది బీసీసీఐ. ఇందులో బ్యాటర్​ ఏకాగ్రతను స్లెడ్జింగ్ ఎలా ప్రభావితం చేస్తుందనే దాని గురించి కోహ్లీ, గంభీర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థులతో మాట్లాడుతూ (ఆర్గ్యూమెంట్ చేస్తున్నప్పుడు) ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? మాటల్లో పడి పరధ్యానంగా ఔట్​ అయ్యే ప్రమాదం ఉందా? లేదంటే బాగా మోటివేట్ అయ్యి ఇంకా మంచిగా ఆడే అవకాశం ఉందా? అని గౌతీని కోహ్లీ ప్రశ్నించాడు.

అందుకు గౌతీ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. 'నా కన్నా నీకే ప్రత్యర్థులతో ఎక్కువ గొడవలు జరిగాయి. నువ్వే ఆ ప్రశ్నకు నాకంటే బాగా సమాధానం చెప్పగలవని భావిస్తున్నాను.' అని గౌతీ సమాధానం చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఇంటర్వ్యూలో నవ్వులు విరబూశాయి. అలాగే 2014-15లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కోహ్లీ చాలా పరుగులు సాధించాడని గంభీర్ ప్రశంసించాడు. కోహ్లీని ప్రత్యర్థులు రెచ్చగొట్టడం వల్లే ఇరగదీశాడని వ్యాఖ్యానించాడు. తాను అందుకే న్యూజిలాండ్​తో 2009లో జరిగిన మ్యాచులో అదరగొట్టానని చెప్పుకొచ్చాడు.

వీడియోలో క్లిప్స్ ఇవే!
బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో 2011 వరల్డ్ కప్ ఫైనల్​లో విన్నింగ్​ మూమెంట్స్​తో పాటు కింగ్ కోహ్లీ, గంభీర్ బ్యాటింగ్ చేసిన క్లిప్స్​ను చూపించారు. అలాగే 2014-15లో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై కోహ్లీ బ్యాటింగ్, న్యూజిలాండ్​పై గంభీర్ సెంచరీ చేసిన సందర్భాలను చూపించారు.

గంభీర్‌కు మొదలైన అసలు 'టెస్టు' - ఆ బాధ్యత మనోడిదే! - IND VS BAN Gambhir Strategy

బంగ్లాతో తొలి టెస్ట్​ - ప్రస్తుతం చెపాక్​ పిచ్​ ఎలా ఉందంటే? - IND VS BAN FIRST TEST PITCH

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.