IND VS BAN First Test Live Streaming : దాదాపు ఆరు నెలల తర్వాత టీమ్ ఇండియా సుదీర్ఘ ఫార్మాట్ ఆడుతోంది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ ఆడుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. రీసెంట్‌గానే పాకిస్థాన్‌ను ఓడించిన బంగ్లాదేశ్ మరో సంచలన విజయం అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకునేందుకు మార్గం సుగమం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది టీమ్ ఇండియా.
తుది జట్లు ఇవే:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్
బంగ్లాదేశ్: నజ్ముల్ శాంటో (కెప్టెన్), షాద్మన్ ఇస్లామ్, జాకిర్ హసన్, మొమినుల్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్, లిటన్ దాస్, మెహిదీ మిరాజ్, నహిద్ రాణా, హసన్ మహ్మద్, తస్కిన్ అహ్మద్
టీమ్ ఇండియాదే ఆధిపత్యం - ఇరు జట్ల బలాబలాలను చూసుకుంటే బంగ్లాదేశ్‌పై టీమ్ఇండియాదే ఆధిపత్యం. ఇప్పటివరకు టీమ్ఇండియా, బంగ్లాదేశ్ మధ్య 13 టెస్ట్ మ్యాచులు జరగగా, అందులో 11 మ్యాచుల్లో భారత జట్టు విజయం సాధించింది. వర్షం కారణంగా రెండు టెస్టు మ్యాచులు రద్దయ్యాయి. టీమ్ఇండియాపై బంగ్లాదేశ్ ఇప్పటివరకు బోణీ చేయలేదు.
ఐదుగురు బౌలర్లు - ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో టీమ్ ఇండియా బరిలోకి దిగింది. ఈ బౌలింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. బుమ్రా, సిరాజ్‌కు తోడుగా కొత్త పేసర్ ఆకాశ్ దీప్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
చెపాక్ స్టేడియంలో స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్‌కు సూపర్ రికార్డ్ ఉంది. మరోసారి వీరిద్దరు చెలరేగితో బంగ్లాదేశ్‌కు కష్టపడాల్సిందే. రోహిత్‌తో జైస్వాల్ ఓపెనర్‌గా బరిలో దిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లితో పాటు రాహుల్ ఎలా ఆడతారనేది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
IND VS BAN First Test Where to Watch : భారత్ - బంగ్లాదేశ్ రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను రిలయన్స్‌కు చెందిన జియో సినిమా, స్పోర్ట్స్ 18 అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్నాయి. స్పోర్ట్స్ 18 ఛానల్‌లో ఈ సిరీస్‌ను చూడొచ్చు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో సినిమాలో ఈ సిరీస్‌ను ఫ్రీగా చూడొచ్చు.
🚨 Toss Update from Chennai
— BCCI (@BCCI) September 19, 2024
Bangladesh have elected to bowl against the @ImRo45-led #TeamIndia in the first #INDvBAN Test!
Follow The Match ▶️ https://t.co/jV4wK7BOKA @IDFCFIRSTBank pic.twitter.com/bbzAoNppiX
632 రోజుల తర్వాత 'టెస్ట్'కు సిద్ధమైన పంత్ - గంభీర్ ఏమన్నాడంటే? - IND VS BAN Pant Test Cricket
కమిందు మెండిస్ అదిరే సెంచరీ - ఒకేసారి ఐదు రికార్డులు సొంతం! - Kamindu Mendis Century Five Records