Ind vs Aus 1st 2024 : బోర్డర్ గావస్కర్ ట్రోఫీ భారత్- ఆస్ట్రేలియా తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి టీమ్ఇండియా 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ స్కోర్ 172-0. క్రీజులో యశస్వీ జైస్వాల్ (90 పరుగులు ; 193 బంతుల్లో 7x4, 2x6), కేఎల్ రాహుల్ (62 పరుగులు; 153 బంతుల్లో ; 4 x4) ఉన్నారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసి, సెంచరీ వైపు దూసుకెళ్తున్నారు.
రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. ప్రత్యర్థుల బౌలింగ్ ఎటాక్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. తర్వాత క్రీజులో పాతుకుపోయి క్రమంగా దూకుడు పెంచారు. టీ బ్రేక్ సమయానికి భారత్ 84/0తో నిలిచింది. ఆఖరి సెషన్‌లో పిచ్ బౌలర్లకు సహకరించడం వల్ల బ్యాటర్లు ఆచితూచి ఆడారు. ఈ క్రమంలోనే జైస్వాల్ 123 బంతుల్లో, రాహుల్ 124 బంతుల్లో అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ 67- 7 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ 104 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లోనే 46 పరుగుల ఆధిక్యం దక్కింది. మిచెల్ స్టార్క్ (26 పరుగులు; 112 బంతుల్లో 2x4) టాప్ స్కోరర్. టీమ్ఇండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5, హర్షిత్ రాణా 3, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.
That's Stumps on Day 2 of the first #AUSvIND Test!
— BCCI (@BCCI) November 23, 2024
A mighty batting performance from #TeamIndia! 💪 💪
9⃣0⃣* for Yashasvi Jaiswal
6⃣2⃣* for KL Rahul
We will be back tomorrow for Day 3 action! ⌛️
Scorecard ▶️ https://t.co/gTqS3UPruo pic.twitter.com/JA2APCmCjx
20ఏళ్లలో తొలిసారి అలా!
కాగా, రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ సత్తా చాటుతున్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 172 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసి ఇంకా క్రీజులో కొనసాగుతున్నారు. అయితే 2004 తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్టుల్లో 100+ పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేయడం ఇదే తొలిసారి. ఇక చివరిసారిగా 2004లో వీరేంద్ర సెహ్వాగ్- ఆకాశ్ చోప్రా జోడీ తొలి వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
గంభీర్ రికార్డ్ బ్రేక్ చేసిన యశస్వి- దెబ్బకు 16ఏళ్ల రికార్డ్ బ్రేక్!