ETV Bharat / sports

మరో కోహ్లీ కావాల్సిందే - నాలుగో స్థానం కోసం టీమ్ఇండియా తిప్పలు! - teamindia fourth position problem

IND VD ENG Test Series 2024 Kohli : టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికి కోహ్లీకి ప్రత్యామ్నయంగా మరో ఆటగాడిని సిద్ధం చేసేందుకు టీమ్ మేనేజ్​మెంట్ కష్టపడుతోంది. ఆ వివరాలు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 9:50 AM IST

IND VD ENG Test Series 2024 Kohli : టీమ్​ ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌లో విరాట్ కోహ్లీ ఉంటే అటు జట్టుకు ఇటు క్రికెట్ అభిమానులకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. టెస్టు ఫార్మాట్ విషయానికొస్తే ఇందులో అతడు చాలా ఏళ్లుగా నాలుగో స్థానంలో(సెకండ్‌ డౌన్‌) బ్యాటింగ్‌కు దిగి జట్టును విజయవంతంగా నడిపిస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడా స్థానంలో నిలకడగా ఆడే మరో ఆటగాడు దొరకడం లేదు. ఎవరైనా వచ్చి కుదురుకున్నారు అని అనుకునేలోపు ఏదో ఒక కారణంతో బయటకు వెళ్లిపోతున్నారు. దీంతో నాలుగో స్థానంలో ఎవరు? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది.

మరో కోహ్లీ కావాలి : కోహ్లీ టెస్టుల్లో నాలుగు స్థానంలోకి దిగి 145 ఇన్నింగ్స్‌ల్లో 7303 పరుగులు చేశాడు. అందులో 25 శతకాలు, 21 అర్ధ శతకాలు ఉన్నాయి. దీని ఆధారంగా అతడి ఆటతీరు ఎంత గొప్పగా ఉంటుందో చెప్పొచ్చు. అయితే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్​కు అతడు వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేడు. దీంతో అతడి స్థానంలో ముగ్గురితో ప్రయత్నించింది మేనేజ్​మెంట్​. కానీ అందుకులో ఒకరు తప్ప మిగిలిన ఇద్దరూ ఫెయిల్​ అయ్యారు. దీంతో నాలుగో స్థానం కోసం మరో కోహ్లీ కావాలి అనే పరిస్థితి ఏర్పడింది.

ఆ ముగ్గురు ఎలా ఆడారంటే? : ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్​లో నాలుగో స్థానంలో కేఎల్‌ రాహుల్‌ దిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులతో ఆకట్టుకున్న అతడు రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులతో తెేలిపోయాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైపోయాడు. అతడి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చి రెండో టెస్ట్​లో వరుసగా 27, 29 పరుగులతో బోల్తా పడ్డాడు. ఇక మూడో, నాలుగో టెస్టుకు కొత్త కుర్రాడు రజత్‌ పటీదార్​ను తీసుకొస్తే అస్సలు ఏమంత ఆడలేకపోయాడు. 5, 0, 17, 0 అతడి స్కోర్​.

దీంతో ఐదో మ్యాచ్‌కు ఎవరిని తీసుకొస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేఎల్​ రాహుల్​ తిరిగొచ్చే అవకాశముందని అంటున్నారు. లేదంటే డగౌట్​లో ఉన్న దేవదత్​ వైపు చూస్తున్నారు. ఏదేమైనా వీళ్లంతా తాత్కాలికం. కోహ్లీకి కూడా 35ఏళ్లు దాటాయి. అతడికి తగ్గ మరో ప్లేయర్​ను తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. చూడాలి మరి టీమ్ మేనేజ్​మెంట్ ఏం చేస్తుందో.

కుర్రాళ్లు కుమ్మేశారు - భారత క్రికెట్‌ భవిష్యత్​కు భరోసా

ఒలింపిక్స్​ టు ఫిఫా - క్రీడా రంగంలో అద్భుతమైన మెగాటోర్నీలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.