ETV Bharat / sports

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే! - భారత్‌,పాక్ మ్యాచ్‌ ఎప్పుడంటే? - ICC Champions Trophy 2025 Schedule - ICC CHAMPIONS TROPHY 2025 SCHEDULE

Champions Trophy 2025 Schedule : పాకిస్థాన్‌ వేదికగా వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ ప్రతిపాదిత షెడ్యూల్ తాజాగా విడుదలైంది. పూర్తి వివరాలు స్టోరీలో

Source ANI
Champions Trophy 2025 Schedule (Source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 4:27 PM IST

Updated : Jul 8, 2024, 4:33 PM IST

Champions Trophy 2025 Schedule : వచ్చే ఏడాది పాకిస్థాన్‌ వేదికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనుంది. ఎనిమిది దేశాలు పాల్గొననున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను కూడా ఐసీసీకి పీసీబీ పంపించింది. కానీ దీనికి బీసీసీఐ నుంచి ఇంకా సమ్మతి రాలేదు. భారత ప్రభుత్వం నిర్ణయం మేరకే బీసీసీఐ తదుపరి చర్యలు తీసుకుంటారు.

అయితే ఇప్పుడు ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రతిపాదిత షెడ్యూల్ విడుదలైనట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో ఏడు లాహోర్‌లో జరగగా మూడు కరాచీలో, ఐదు రావల్పిండిలో జరిగేలా షెడ్యూల్ డిజైన్ చేశారు. భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌ మార్చి 1న లాహోర్​లో జరగనున్నట్లు ఇందులో ఉంది. సెమీ ఫైనల్స్‌కు కరాచీ, రావల్పిండి వేదికలుగా, ఫైనల్‌కు లాహోర్‌ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇకపోతే ఇక్కడి స్టేడియాలను కూడా ఆధునికరించనున్నారు. వీటి కోసం పీసీబీ 17 బిలియన్లు కేటాయించింది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ప్రతిపాదిత షెడ్యూల్ ఇదే

  • ఫిబ్రవరి 19: న్యూజిలాండ్ vs పాకిస్థాన్ - కరాచీ
  • ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్ vs భారత్ - లాహోర్
  • ఫిబ్రవరి 21: అఫ్గానిస్థాన్‌ vs దక్షిణాఫ్రికా - కరాచీ
  • ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ - లాహోర్
  • ఫిబ్రవరి 23: న్యూజిలాండ్ vs భారత్ - లాహోర్
  • ఫిబ్రవరి 24: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ - రావల్పిండి
  • ఫిబ్రవరి 25: అఫ్గానిస్థాన్‌ vs ఇంగ్లాండ్ - లాహోర్
  • ఫిబ్రవరి 26: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా - రావల్పిండి
  • ఫిబ్రవరి 27: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ - లాహోర్
  • ఫిబ్రవరి 28: అఫ్గానిస్థాన్‌ vs ఆస్ట్రేలియా - రావల్పిండి
  • మార్చి 1: పాకిస్థాన్ vs భారత్ - లాహోర్
  • మార్చి 2: దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ - రావల్పిండి
  • మార్చి 5: సెమీ-ఫైనల్ - కరాచీ
  • మార్చి 6: సెమీ-ఫైనల్ - రావల్పిండి
  • మార్చి 9: ఫైనల్‌ - లాహోర్

గ్రూప్‌ ఎ - టీమ్​ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్

గ్రూప్‌ బి - ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్‌

వెళ్తారో లేదో - అయితే భద్రత, రవాణా కారణాల దృష్ట్యా టీమ్​ఇండియా మ్యాచులు లాహోర్‌ గడాఫీ స్టేడియంలో ఆడేలా షెడ్యూల్ రూపొందించారు. ఒకవేళ టీమ్​ఇండియా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే అది కూడా అక్కడే జరుగుతుంది. కాగా, ఇప్పటికే ఆటగాళ్ల భద్రత, ఇతర కారణాల దృష్ట్యా 2008 ఆసియా కప్‌ తర్వాత నుంచి పాక్ పర్యటనకు వెళ్లట్లేదు. మరి ఇప్పుడు వెళ్తుందో లేదో.

టీమ్​ఇండియా బ్యూటీ స్మృతి మందాన - ఇప్పుడు ఎవరితో డేటింగ్ చేస్తుందో తెలుసా? - Smrithi Mandhana Boyfriend

184 దేశాలు, 10వేల అథ్లెట్లు, 329 పతకాలు- పారిస్ ఒలింపిక్స్ ఫుల్ డీటెయిల్స్ - PARIS OLYMPICS 2024

Last Updated : Jul 8, 2024, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.