ETV Bharat / sports

టెస్ట్​ ర్యాంకింగ్స్​లో టాప్​ 20 నుంచి విరాట్ ఔట్ - 10 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా!​ - ICC TEST RANKINGS

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్​లో మన స్టార్స్​ ఏయే పొజిషన్​లు సొంతం చేసుకున్నారంటే?

ICC Test Rankings
ICC Test Rankings (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 6, 2024, 5:01 PM IST

ICC Test Rankings : తాజాగా విడుదలైన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకొచ్చాడు టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్​ పంత్. ఈ ర్యాంకింగ్స్​లో అతడు ఐదు స్థానాలు ఎగబాకి ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఎనిమిది స్థానాలు దిగజారి టాప్-20 ర్యాంకింగ్స్‌ నుంచి నిష్క్రమించాడు. ఈ ర్యాంకింగ్స్​లో అతడు ప్రస్తుతం 22వ స్థానానికి పరిమితమయ్యాడు.

మరోవైపు 2014 డిసెంబరు తర్వాత విరాట్ ఇలా టాప్‌-20 నుంచి కిందికి దిగజారిపోవడం ఇదే తొలిసారి. ఇక టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెండు స్థానాలు దిగజారి 26వ స్థానానికి చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్ మాత్రం ఒక స్థానం కోల్పోయి నాలుగో పొజిషన్​లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 90 పరుగులు స్కోర్ చేసిన యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్, ఈ ర్యాంకింగ్స్​లో నాలుగు స్థానాలను మెరుగుపరుచుకుని 16వ పొజిషన్​కు చేరుకున్నాడు. మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 82 పరుగులు స్కోర్ చేసిన న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ తాజా ర్యాంకింగ్స్​లో ఎనిమిది స్థానాలు ఎగబాకి ఏడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్​ ప్లేయర్స్ జో రూట్, హ్యారీ బ్రూక్‌, అలాగే న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ టాప్ 3 పొజిషన్స్​ను కైవసం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మన ప్లేయర్లు టాప్​ 10 పొజిషన్స్​లో ఉన్నా కూడా కొందరూ మాత్రం తమ మునుపటి స్థానం నుంచి కిందకు పడిపోయారు. రవిచంద్రన్ అశ్విన్ ఒక స్థానం దిగజారి ఐదో స్థానానికి పడిపోగా, రవీంద్ర జడేజా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక జస్‌ప్రీత్ బుమ్రా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే వాషింగ్టన్ సుందర్ మాత్రం ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని 46వ స్థానానికి చేరుకున్నాడు.

ఇక ఈ లిస్ట్​లో కగిసో రబాడ, జోష్ హేజిల్‌వుడ్ వరుసగా మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 12 స్థానాలు మెరుగుపరుచుకుని 22వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు ఆల్‌రౌండర్ల జాబితాలో మాత్రం ఈ సారి అంతగా మార్పులు జరగలేదు. ఈ కేటగిలో స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా టాప్‌లో కంటిన్యూ అవుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.