ICC Test Rankings 2024 : ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ తాజాగా విడుదలైంది. అందులో తాజాగా బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఆల్‌రౌండర్ పర్ఫామెన్స్తో అదరగొట్టిన ప్లేయర్లకు ఐసీసీ ర్యాంక్స్ నిర్దేశించింది. ఈ నేపథ్యంలో పలువురు ప్లేయర్లు తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకుని దూసుకెళ్లారు.
ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అదరగొట్టిన ఇంగ్లాండ్ ప్లేయర్ ఒలీ పోప్ 20 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచులో అర్థ సెంచరీతో చెలరేగిపోయిన ఉస్మాన్ ఖవాజా ఈ సారి 2 స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానాని కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ మాత్రం టాప్ వన్ ర్యాంకర్‌గా కొనసాగుతున్నాడు.
ఇక భారత ఆటగాళ్లలో టీమ్ఇండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ ఓ స్థానాన్ని మెరుగుపరచుకుని ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు. అయితే టాప్-10లో భారత్ నుంచి కోహ్లీ మాత్రమే ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 12, రిషబ్ పంత్ పంత్ 13వ స్థానాలను సాధించారు.
టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-5 ప్లేయర్స్ :
1.కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) – 864 రేటింగ్ పాయింట్లు
2.జో రూట్ (ఇంగ్లండ్) – 832
3.స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 818
4.డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) – 786
5.బాబర్ ఆజం (పాకిస్తాన్) – 768
మరోవైపు టెస్టు బౌలర్ల ర్యాంకింగ్‌లో టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఆరు వికెట్లు తీసిన ఈ స్టార్ స్పిన్నర్. 853 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక స్థానాన్ని మెరుగుపరచుకుని నాలుగో స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా ఆరో స్థానంలో ఉన్నాడు.
టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-5 వీరే :
1.రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా) – 853 రేటింగ్ పాయింట్లు
2.కగిసో రబడ (సౌతాఫ్రికా) – 851
3.పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 828
4.జస్‌ప్రీత్ బుమ్రా (భారత్) – 825
5.జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 818
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ -5 ప్లేయర్స్ :
1.రవీంద్ర జడేజా (భారత్) – 425 పాయింట్లు
2.రవిచంద్రన్ అశ్విన్ (భారత్) – 328
3.షకీబ్ అల్‌హసన్ (బంగ్లాదేశ్) – 320
4.జో రూట్ (ఇంగ్లాండ్) – 313
5.బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) – 307
బాబర్‌దే అగ్రస్థానం- మళ్లీ టాప్‌లోకి పాక్ బ్యాటర్- టీ20 నెం.1 బౌలర్‌గా రషీద్
ICC Rankings : టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మనోళ్లదే డామినేషన్!