ETV Bharat / sports

విరాట్, యశస్వి ముందుకు- బాబర్ ర్యాంక్ ఢమాల్ - ICC Rankings

author img

By ETV Bharat Sports Team

Published : Aug 28, 2024, 3:54 PM IST

ICC Rankings 2024: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) లేటెస్ట్ టెస్టు ర్యాంకింగ్స్​ బుధవారం రిలీజ్ చేసింది. ఈ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా బ్యాటర్ల స్థానాలు మెరుగుపడగా, పాక్ ప్లేయర్ బాబర్ ఏకంగా ఆరు స్థానాలు కోల్పోయాడు.

ICC Rankings
ICC Rankings (Source: Getty Images)

ICC Rankings 2024: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) లేటెస్ట్​గా టెస్టు ర్యాంకింగ్స్​ రిలీజ్ చేసింది. బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ 2 స్థానాలు, యశస్వీ జైశ్వాల్ 1 ప్లేస్ మెరుగుపర్చుకున్నారు. ప్రస్తుతం జైశ్వాల్ (740 రేటింగ్స్) 7న స్థానం దక్కించుకోగా, విరాట్ (737 రేటింగ్స్​) 8వ ప్లేస్​లో కొనసాగుతున్నాడు. కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ 751 రేటింగ్స్​తో 6వ స్థానంలో ఉన్నాడు.

అయితే పాక్ బ్యాటర్, లిమిటెడ్ ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్​ ఏకంగా 6స్థానాలు కోల్పోయాడు. బాబర్ ప్రస్తుతం 734 రేటింగ్స్​తో 9వ ర్యాంక్​కు పడిపోయాడు. మరోవైపు పాకిస్థాన్ మరో బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 7స్థానాలు మెరుగు పర్చుకున్నాడు. రిజ్వాన్ 728 రేటింగ్స్​తో 10వ ర్యాంక్​లో కొనసాగుతున్నాడు. ఇక ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (881 రేటింగ్స్) టాప్​ ప్లేస్​ నిలబెట్టుకున్నాడు. తర్వాత న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్ (859 రేటింగ్స్), డారిల్ మిచెల్ (768 రేటింగ్స్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

టాప్ 5 బ్యాటర్లు

1జో రూట్ఇంగ్లాండ్881 రేటింగ్స్
2కేన్ విలియమ్సన్న్యూజిలాండ్‌859 రేటింగ్స్
3డారిల్ మిచెల్న్యూజిలాండ్‌768 రేటింగ్స్
4హ్యారీ బ్రూక్ఇంగ్లాండ్758 రేటింగ్స్​
5స్టీవ్ స్మిత్ఆస్ట్రేలియా757 రేటింగ్స్

టాప్ 5 బ్యాటర్లు
ICC Test Bowling Ranking: మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (870 రేటింగ్స్​) టాప్​ ప్లేస్​లో కొనసాగుతుండగా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (847 రేటింగ్స్​), ఆస్ట్రేలియా ప్లేయర్ జోష్ హేజిల్​వుడ్ (847 రేటింగ్స్​)తో కలిసి రెండో స్థానం పంచుకున్నాడు. ఇక టీమ్ఇండియా నుంచి మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా (788 రేటింగ్స్) 7వ స్థానం నిలబెట్టుకున్నాడు. దీంతో ముగ్గురు టీమ్ఇండియా ప్లేయర్లు టాప్- 10లో ఉన్నారు.

టాప్ - 5 బౌలర్లు

1రవిచంద్రన్ అశ్విన్ భారత్​870 రేటింగ్స్
2జస్ప్రీత్ బుమ్రాభారత్​847 రేటింగ్స్
.జోష్ హేజిల్​వుడ్ ఆస్ట్రేలియా 847 రేటింగ్స్
4ప్యాట్ కమిన్స్​ఆస్ట్రేలియా 820 రేటింగ్స్​
.కగిసో రబాడాసౌతాఫ్రికా820 రేటింగ్స్​

ఇక టెస్టు ఫార్మట్ టీమ్ ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియా అగ్రస్థానం నిలబెట్టుకుంది. 124 రేటింగ్స్​తో ఆసీస్ టాప్​లో ఉండగా, భారత్ (120 రేటింగ్స్) రెండో స్థానంలో కొనసాగుతోంది. తర్వాత ఇంగ్లాండ్ (108 రేటింగ్స్), సౌతాఫ్రికా (104 రేటింగ్స్), న్యూజిలాండ్ (96 రేటింగ్స్) వరుసగా స్థానాల్లో ఉన్నాయి.

ICC ర్యాంకింగ్స్: సత్తాచాటిన రోహిత్, గిల్, విరాట్- టాప్ 5లో ముగ్గురు మనోళ్లే - ICC Ranking

టెస్టు ర్యాంకింగ్స్ రిలీజ్- అగ్రస్థానానికి చేరువలో రూట్- మరి రోహిత్, విరాట్ ప్లేస్? - ICC Test Ranking 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.