ETV Bharat / sports

భారత్​కు షాక్- కామన్వెల్త్ గేమ్స్​లో​ నో హాకీ!- కారణం అదే

భారత హాకీ అభిమానులకు షాక్ తగలనుంది- 2025 కామన్వెల్త్ గేమ్స్​ నుంచి ఈ ఆట ఔట్!

2026 Commonwealth Games
2026 Commonwealth Games (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 6 hours ago

2026 Commonwealth Games Hockey : భారత హకీ అభిమానులకు షాకింగ్ న్యూస్‌! 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో హాకీని తొలగిస్తారని ప్రచారం సాగుతోంది. నాలుగేళ్లకొసారి జరిగే కామన్వెల్త్‌ గేమ్స్​కు ఈ సారి స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరం ఆతిథ్యమివ్వనుంది. ఈ పోటీలు 2025 జులై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్నాయి. అయితే ఈ టోర్నీని తొలుత ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. కానీ, పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఆతిథ్యమిచ్చేందుకు విక్టోరియా నో చెప్పింది. దీంతో పోటీలు స్కాట్లాండ్​కు షిఫ్ట్ అయ్యాయి.

కారణం అదే!
ఇక 2022 బర్మింగ్‌హామ్​ కామన్వెల్త్ గేమ్స్​లో మొత్తం 19 ఈవెంట్‌లు నిర్వహించారు. అయితే, ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఈ సారి 9 ఈవెంట్లు తగ్గించి కేవలం 10 క్రీడాంశాలతోనే టోర్నీని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హాకీ, రోడ్‌ రేసింగ్‌, నెట్‌ బాల్​తోపాటు మరో ఆరు ఈవెంట్‌లను తొలగిస్తారని ప్రచారం సాగుతోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్​మెంట్ కూడా రానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

భారత్​కు పెద్ద దెబ్బ!
అయితే కామన్వెల్త్ గేమ్స్​లో నుంచి హాకీ ఆటను తొలగిస్తే భారత్‌కు పెద్దదెబ్బ తగిలినట్లవుతుంది. ప్రతిసారి భారత్ పతకం సాధించే క్రీడాంశాల్లో హాకీ ఉంటుంది. అలా ఈసారి కూడా భారత హాకీ జట్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ పోటీల్లో పురుషుల హాకీ జట్టు ఇప్పటిదాకా మూడుసార్లు సిల్వర్, రెండుసార్లు బ్రాంజ్​ పతకాలు సాధించింది. ఇక 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 61 పతకాలతో సత్తా చాటింది. ఓవరాల్​గా టోర్నీలో పతకాల సంఖ్యలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 22 పసిడి, 16 రజతాలు, 23 కాంస్యాలు ఉన్నాయి. రెజ్లింగ్‌లో అత్యధికంగా 12 పతకాలు రాగా, వెయిట్ లిప్టింగ్‌లో 10 మెడల్స్​ వచ్చాయి.

భారత హాకీ జట్టు రీసెంట్​గా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్​లో కాంస్యం నెగ్గిన భారత హాకీ జట్టు, రీసెంట్​గా 2024 ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో స్వర్ణం ముద్దాడింది.

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత భారత్‌- ఐదోసారి ట్రోఫీ కైవసం - India Wins Asian Champions Trophy

ఒలింపిక్స్ విన్నర్స్ కంటే ఛాయ్​వాలాకే ఎక్కువ క్రేజ్?- హాకీ ప్లేయర్ డిసప్పాయింట్! - Hockey India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.