Hardik Pandya Injury Status : చీలమండ గాయం కారణంగా వరల్డ్ కప్‌తో పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు దూరమయ్యాడు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య. దాదాపు నాలుగు నెలల పాటు విశ్రాంతలో ఉన్న ఈ స్టార్ క్రికెటర్ ఇప్పుడు నెమ్మదిగా కోలుకుని ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రాక్టీస్‌ను ప్రారంభించిన పాండ్య గాయం కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
" రెండు లేదా మూడు నెలల ముందు నుంచే వరల్డ్ కప్ కోసం సన్నద్ధమయ్యే ప్లేయర్‌ను కాదు. నేను నా జర్నీని ఏడాదిన్నర ముందే మొదలెట్టాను. ఎలా ప్రిపేర్ కావలన్న దాని గురించి ప్లాన్ కూడా వేసుకున్నాను. అయితే ఒక్కసారిగా గాయపడటం వల్ల నేను చాలా ఇబ్బందిపడ్డాను. ఈ విషయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఒక వేళ నేను 25 రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే నేను వరల్డ్ కప్ మిస్ అయ్యేవాడిని. కానీ, ఐదు రోజుల్లోనే వస్తానంటూ మేనేజ్‌మెంట్‌కు చెప్పాను. దాని కోసమే నేను నా చీలమండకు వివిధ చోట్ల ఇంజెక్షన్లు సైతం చేయించుకున్నాను. అది వాచిపోవడం వల్ల ఒకసారి రక్తాన్ని తొలగించాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో నేను వెనక్కి వెళ్లకూడని బలంగానే నిశ్చయించుకున్నాను. నా అత్యుత్తమ ఆటతీరును చూపించాలని అనుకున్నాను. ఒకవేళ మళ్లీ గాయానికి గురైతే నేను సుదీర్ఘ కాలంపాటు ఆటకు దూరం కావాల్సి ఉంటుంది. దానికి నా వద్ద అప్పుడు సమాధానం లేదు. ఒక్క శాతం అవకాశం ఉన్నా కూడా జట్టుతో పాటు ఉండేందుకు ప్రయత్నిస్తాను. దురదృష్టవశాత్తూ గాయం మళ్లీ తిరగబెట్టింది. దాంతో మూడు నెలలపాటు ఆటకు దూరంగా ఉండాలని చెప్పారు. ఆరంభంలో నడవడానికి కూడా వీలు పడేది కాదు. వరల్డ్ కప్‌లో ఆడటం నాకెంతో గర్వకారణంగా ఉంది. అంతకుమించిన మరొకటి ఉండదు. అందుకోసం నేను పెయిన్ కిల్లర్స్‌ను తీసుకొని పది రోజుల్లోనే రెడీ అయ్యాను" " అంటూ వరల్డ్ కప్ కోసం తాను పడ్డ కష్టాన్ని వివరించాడు. అని హార్దిక్ తెలిపాడు.
-
Kung Fu Pandya 🥋
— Mumbai Indians (@mipaltan) March 16, 2024
🎥 Coming 🔜 to a stadium near you 🏟️#OneFamily #MumbaiIndians @hardikpandya7 pic.twitter.com/U9H6Lj3bYM
'హార్దిక్ లేకుండానే గుజరాత్ స్ట్రాంగ్‌గా ఉంది'- పాండ్యపై ఆసీస్ మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు
పాండ్య సూపర్ కమ్‌బ్యాక్- వరల్డ్‌కప్ తర్వాత తొలి మ్యాచ్‌లోనే అదుర్స్