GT VS PBKS IPL 2024 : చండీగఢ్‌లోని మహారాజా యద్వీందర్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో గుజరాత్‌దే పైచేయిగా నిలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి ఆలౌటైంది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్(35), బ్రార్(29), కరన్(20) ఫర్వాలేదనిపించారు. రొస్సోవ్(9), జితేశ్(13), లివింగ్‌స్టన్(6), శశాంక్(8), అశుతోష్(3), భాటియా(13), రబాడ(1*) విఫలమయ్యారు. ఇక గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 4 వికెట్లు తీయగా, మోహిత్ శర్మ, నూర్ రెండేసి, అలాగే రషీద్ ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత పంజాబ్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు గుజరాత్ బరిలోకి దిగింది. తొలి బంతి నుంచి ఆచితూచి ఆడూతూ వచ్చింది. ఓపెనర్‌గా వచ్చిన శుభ్‌మన్ గిల్ 35 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే అర్ధసెంచరీ చేస్తాడనుకుంటున్న సమయంలో లివింగ్‌స్టన్ వేసిన మూడో బంతికి భారీ షాట్ ఆడబోయి రబాడకు చిక్కాడు. దీంతో అనూహ్యంగా పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ కూడా జట్టుకు కీలక పరుగులు అందించాడు. అయితే 31 పరుగులతో దూసుకెళ్తున్న సమయంలో సామ్ కరణ్ చేతికి చిక్కాడు. దీంతో అజ్మతుల్లా ఒమర్జాయ్ కాస్త జాగ్రత్తగా ఆడాడు. కానీ జితేశ్ శర్మ అతడ్ని పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ తెవాటియా రాణించాడు.
గుజరాత్ టైటాన్స్ (తుది జట్టు) : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్ శర్మ.
ఇంపాక్ట్ సబ్స్ : సాయి సుదర్శన్, శరత్ BR, మానవ్ సుతార్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్.
పంజాబ్ కింగ్స్ (తుది జట్టు): సామ్ కరన్(కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రిలీ రోసోవ్, లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.
ఇంపాక్ట్ సబ్స్: రాహుల్ చాహర్, విధ్వత్ కావరప్ప, అథర్వ తైడే, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, శివమ్ సింగ్.
ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు - ఒక్క పరుగు తేడాతో కోల్‌కతా విజయం - IPL 2024
సన్‌రైజర్స్ ఆ'రేంజ్' మారింది- సక్సెస్ వెనకాల 'ఒక్కడు'- చెప్పిమరి చేస్తున్నాడుగా! - IPL 2024