Funny Celebrations Cricket: క్రికెట్లో ఆయా ప్లేయర్లకు తమ తమ ట్రేడ్‌మార్క్ సెలబ్రెషన్స్ ఉంటాయి. అలా ట్రేడ్‌మార్క్ సెలబ్రేషన్స్‌తో క్రికెటర్లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. వాళ్లు అలా గ్రౌండ్లో సెలబ్రేట్ చేసుకుంటే ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొందరు ఢిఫరెంట్‌గా తమ విక్టరీని సెలబ్రేట్ చేసుకొని సోషల్ మీడియాలో, వార్తల్లో వైరల్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా వెస్టిండీస్ క్రికెటర్లైతే ఇలాంటి వాటిల్లో కాస్త ముందుంటారు. ఆటతోనే కాకుండా ఢిఫరెంట్ సెలబ్రేషన్స్‌తో ఆడియెన్స్‌ను బాగా ఎంటర్టైన్ చేస్తారు. అలాగే ప్రస్తుతం ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఇలాంటి వినూత్న సంబరం జరిగింది.
వెస్టిండీస్ యంగ్ స్పిన్నర్ కెవిన్ సింక్లేర్ జాతీయ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో 48న ఓవర్ బౌలింగ్ చేస్తున్న సిక్లేర్, రెండో బంతికి ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ కవాజా (75 పరులుగు)ను బోల్తా కొట్టించాడు. సిక్లెర్ బంతిని తప్పుగా అంచనా వేసిన ఖవాజా షాట్ ఆడే ప్రయత్నంలో ఫస్ట్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌కు దొరికిపోయాడు. దీంతో ఖావాజా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఇక అంతర్జాతీయ టెస్టు కెరీర్లో తొలి వికెట్ దక్కించున్న సింక్లేర్ వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. వికెట్ పడగొట్టిన వెంటనే అమాంతం గాల్లోకి ఎగిరి హై జంప్ చేశాడు. రెండుసార్లు గాల్లోనే గింగిరాలు కొట్టిన సింక్లేర్ను చూసి ఆటగాళ్లతో సహ ఆడియెన్స్ కూడా ఆశ్చర్యపోయారు.
-
Kevin Sinclair iconic celebration after taking first wicket#AUSvWIpic.twitter.com/WXNgAS5i5H
— sports_mania (@sportsm95837301) January 26, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kevin Sinclair iconic celebration after taking first wicket#AUSvWIpic.twitter.com/WXNgAS5i5H
— sports_mania (@sportsm95837301) January 26, 2024Kevin Sinclair iconic celebration after taking first wicket#AUSvWIpic.twitter.com/WXNgAS5i5H
— sports_mania (@sportsm95837301) January 26, 2024
మ్యాచ్ విషయానికొస్తే: తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 311 పరుగులకు ఆలౌటైంది. కేవమ్ హోడ్జ్ (71), జొషువా డి సిల్వా (7), కెవిన్ సింక్లేర్ (50), హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4, జోష్ హేజిల్‌వుడ్ 2, లియన్ 2, ప్యాట్ కమిన్స్ 1 వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 22 పరుగుల వెనుకంలో ఉండగానే 289-9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖవాజా (75), అలెక్స్ కేరీ (65), కమిన్స్ (64) రాణించారు. ఇక రెండు రోజుల ఆట ముగిసేసరికి విండీస్ 35 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ ప్రస్తుతం 13-1తో బ్యాటింగ్ చేస్తోంది.
విరాట్ 'సూపర్ మ్యాన్ ఫీట్'- 5 పరుగులు సేఫ్- మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే!