ETV Bharat / sports

సచిన్ టు ఫాతిమా సన- టోర్నీ మధ్యలోనే వారి ఇంట విషాదం! - CRICKETERS FATHERS PASSED AWAY

Cricketers Lost Fathers During Tournment : క్రికెట్ టోర్నమెంట్​ల్లో ఆడుతుండగా కుటుంబ సభ్యులను కోల్పోయిన ప్లేయర్లు వీళ్లే!

Cricketers Lost Fathers
Cricketers Lost Fathers (Source: Getty Images (Left, Right), AP (Middle))
author img

By ETV Bharat Sports Team

Published : Oct 11, 2024, 12:27 PM IST

Cricketers Lost Fathers During Tournment : పాకిస్థాన్ మహిళల టీ20 జట్టు కెప్టెన్ ఫాతిమా సనా ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి అక్టోబరు 10న గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. దీంతో ఆమె మహిళల టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి మధ్యలోనే వైదొలిగింది. దుబాయ్ నుంచి స్వదేశానికి వెళ్లింది. అక్టోబరు 11, 14న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​తో జరిగే మ్యాచ్​లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మునీబా అలీ పాక్ తాత్కాలిక కెప్టెన్​గా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో క్రికెట్ టోర్నమెంట్​ల సమయంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.

రషీద్ ఖాన్
అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తండ్రి హాజీ ఖలీల్‌ 2018 డిసెంబర్​లో కన్నుమూశారు. ఆ సమయంలో రషీద్ ఆస్ట్రేలియా డొమెస్టిక్ టోర్నీ బిగ్ బాష్ లీగ్​లో ఆడుతున్నాడు. అయితే రషీద్ తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. కుటుంబ సభ్యుల మద్దతుతో, తండ్రి మరణించిన మరుసటి రోజే అడిలైడ్ స్ట్రైకర్స్‌ తరఫున మైదానంలోకి దిగాడు. సిడ్నీ థండర్‌పై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్​లో రెండు వికెట్లు పడగొట్టాడు.

మహ్మద్ సిరాజ్
2020 నవంబరులో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు తన తండ్రి మహ్మద్ గౌస్ మరణించారు. ఈ వార్త సిరాజ్​ను తీవ్రంగా కుదిపేసింది. అయినప్పటికీ దేశం తరఫున ఆడాలన్న కసితో సిరాజ్ స్వస్థలం హైదరాబాద్​కు రాలేదు. ఆ పర్యటనలోనే టెస్టు అరంగేట్రం చేసిన సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టి తండ్రికి ఘనమైన నివాళిని అర్పించాడు.

సచిన్ తెందూల్కర్
1999 ప్రపంచ కప్ సమయంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తన తండ్రి రమేశ్ తెందూల్కర్​ను కోల్పోయాడు. ఈ విషాదవార్త తెలుసుకున్న సచిన్ వెంటనే స్వదేశానికి బయలుదేరి తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. అనంతరం ఇంగ్లాండ్ బయలుదేరాడు. వెంటనే కెన్యాతో జరిగిన మ్యాచ్​లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ శతకం బాదాడు.

విరాట్ కోహ్లీ
టీమ్ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తండ్రి ప్రేమ్ కోహ్లీ గుండెపోటుతో 2006లో మరణించారు. అప్పటికి విరాట్ వయసు 17 ఏళ్లే. రంజీల్లో దిల్లీ తరఫున ఆడుతున్నాడు. తండ్రి మృతదేహం ఇంటి వద్ద ఉండగానే మ్యాచ్ కోసం స్టేడియానికి వెళ్లిపోయాడు. కర్ణాటకతో జరిగిన మ్యాచ్​లో 90 పరుగుల చేసి దిల్లీ జట్టుని ఫాలో ఆన్ నుంచి బయటపడేశాడు.

క్రికెట్ దిగ్గజానికి కుల్​దీప్ నివాళులు - ఎమోషనలైన స్టార్ స్పిన్నర్ - Kuldeep Yadav Tributes Shane Warne

మాజీ క్రికెటర్ బలవన్మరణం!- షాకింగ్ విషయాలు బయటపెట్టిన అతడి భార్య!! - Graham Thorpe Comitted Suicide

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.