ETV Bharat / sports

'నా పెన్షన్ డబ్బులు కూడా ఇచ్చేస్తా- చాలా బాధగా ఉంది!' - Kapil Dev Anshuman Gaekwad

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 2:36 PM IST

Kapil Dev Anshuman Gaekwad: బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న మాజీ క్రికెటర్ అన్షుమన్​ గైక్వాడ్​కు ఆర్థిక సహాకారం అందించాలని లెజెండరీ ప్లేయర్ కపిల్ దేవ్ బీసీసీఐని కోరాడు. అవసరమైతే తన పెన్షన్ డబ్బులు కూడా ఇచ్చేందుకు రెడీగా ఉన్నానని అన్నాడు.

Kapil Dev Anshuman Gaekwad
Kapil Dev Anshuman Gaekwad (Source: ANI)

Kapil Dev Anshuman Gaekwad: టీమ్ఇండియా లెజెండరీ ప్లేయర్ కపిల్ దేవ్, బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న మాజీ క్రికెటర్ అన్షుమన్​ గైక్వాడ్ ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశాడు. గైక్వాడ్ చికిత్స కోసం బీసీసీఐ ఆర్థిక సహాయం చేయాలని కోరాడు. అవసరమైతే తన పెన్షన్ డబ్బులు అన్షుకు ఇస్తామని కపిల్ దేవ్ అన్నాడు. అలాగే మాజీ ప్లేయర్లు మోహిందర్ అమర్నాథ్, సునీల్ గావస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్​సర్కార్, మదన్ లాల్, రవి శాస్త్రీ తదితరులు అన్షూ చికిత్సకు నిధులు సేకరిస్తున్నామని పేర్కొన్నాడు.

'అన్షూను ఇలాంటి పరిస్థితుల్లో చూడడం బాధగా ఉంది. ఆతడితో కలిసి నేను చాలా మ్యాచ్​లు ఆడాను. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. అతడికి బీసీసీఐ కూడా ఆర్థిక సహాయం అందిస్తే బాగుంటుంది. మేం ఎవరినీ బలవంతపెట్టట్లేదు. కానీ, మన జట్టు కోసం అన్షూ ఎన్నోసార్లు ఫాస్ట్ బౌలర్లకు ఎదురునిలబడి ముఖం, ఛాతిపై దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు అతడి కోసం మనమంతా నిలబడాల్సిన సమయం వచ్చింది' అని కపిల్ దేవ్ అన్నాడు.

కాగా, ఇదే సందర్భంగా బీసీసీఐలోని వ్యవస్థీకృత లోపాన్ని కపిల్ దేవ్ ఎత్తిచూపాడు. 'ఈ జనరేషన్ ప్లేయర్లు రెమ్యునరేషన్ బాగానే అందుకుంటున్నారు. సపోర్టింగ్ స్టాఫ్​కు కూడా జీతాలు బాగానే ఉన్నాయి. కానీ, మా కాలంలో బోర్డు వద్ద అంత డబ్బు లేదు. ఇప్పుడు అలా కాదు. పరిస్థితి వేరుగా ఉంది. మాజీ ప్లేయర్ల సంరక్షణ బాధ్యతలు బీసీసీఐ తీసుకోవాలి. దురదృష్టవశాత్తు మనకు అలాంటి వ్యవస్థ లేదు. ఎలాంటిది ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తే బాగుంటుంది' అని పేర్కొన్నాడు.

కాగా, అన్షుమాన్ గైక్వాడ్ (71) దాదాపు ఏడాది నుంచి బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ప్రస్తుతం లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అతడు 1975- 1987 మధ్య కాలంలో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 12ఏళ్ల కెరీర్​లో 40 టెస్టులు, 15 వన్డే మ్యాచ్​లు ఆడాడు. ఆ తర్వాత టీమ్ఇండియా హెడ్ కోచ్​గా కూడా పనిచేశాడు.

భారత మాజీ క్రికెటర్​కు బ్లడ్​ క్యాన్సర్​​ - ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు! - Anshuman Gaekwad Blood Cancer

Kapil Dev Kidnap : కపిల్ దేవ్ కిడ్నాప్ కథ సుఖాంతం - ఊపిరి పీల్చుకున్న అభిమానులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.