ETV Bharat / sports

క్రికెట్​లో 'విరాటే' కింగ్, మరి ధోనీ?- రైనా ఇంట్రెస్టింగ్ ఆన్సర్! - Suresh Raina MS Dhoni - SURESH RAINA MS DHONI

Suresh Raina MS Dhoni: మాజీ కెప్టెన్ ధోనీ, స్టార్ బ్యాటర్ విరాట్​ కోహ్లీపై సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Suresh Raina MS Dhoni
Suresh Raina MS Dhoni (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 10:45 AM IST

Suresh Raina MS Dhoni: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్​ఎస్​ ధోనీ, స్టార్ బ్యాటర్ విరాట్​ కోహ్లీపై సీనియర్​ ప్లేయర్ సురేశ్ రైనా రీసెంట్​గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్​ను రన్​ మిషీన్​గా పేర్కొన్న రైనా, ధోనీని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) అని అభివర్ణించాడు. రైనా ప్రస్తుతం ఇంగ్లాండ్​లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్​షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్​లో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా లెజెండ్స్​తో మ్యాచ్ అనంతరం రైనా ఈ కామెంట్స్ చేశాడు.

టోర్నీలో ఇటీవల భారత్ లెజెండ్స్ జట్టు సౌతాఫ్రికా లెజెండ్స్​తో తలపడింది. ఈ మ్యాచ్ అనంతరం రైనా ప్రజెంటేటర్​తో ర్యాపిడ్ ఫైర్​లో పాల్గొన్నాడు. ఈ ర్యాపిడ్ ఫైర్​ సెషన్​లో క్రికెట్​లో విరాట్​ను 'కింగ్','రన్ మిషీన్', ధోనీని 'గోట్' (GOAT)గా పేర్కొన్నాడు. దీంతో ధోనీ ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ధోనీ- రైనా ఫ్రెండ్​షిప్​ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఇదే ర్యాపిడ్ ఫైర్​లో మరికొంత మంది ఇండియన్ ప్లేయర్లపై తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. పేసర్ జస్ర్పీత్ బుమ్రాను 'డెత్ ఓవర్ స్పెషలిస్ట్', యువరాజ్ సింగ్​ను 'మోస్ట్​ స్టైలిష్', శుభ్​మన్ గిల్ 'టీమ్ఇండియా ఫ్యూచర్' అని అభివర్ణించాడు.​

రైనాకు ధోనీతో ప్రత్యేక అనుబంధం ఉంది. టీమ్ఇండియాతోపాటు ఒక దశాబ్ద కాలం ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్​కు కలిసి ఆడారు. చెన్నై జట్టుకు ధోనీ కెప్టెన్​గా ఉన్న సమయంలో రైనా వైస్​కెప్టెన్​గా వ్యవహరించాడు. ఇక 2020 ఆగస్టు 15న ఒకేరోజు ధోనీ, రైనా ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత రైనా 2021లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడగా, ధోనీ ఇంకా కొనసాగుతున్నాడు.

Raina International Career: రైనా కెరీర్​లో 18 టెస్టులు, 226 వన్డే, 78 టీ20 మ్యాచ్​ల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. అందులో టెస్టు (768 పరుగులు), వన్డే (5615 పరుగులు), టీ20 (1604 పరుగులు) చేశాడు. కాగా, అంతర్జాతీయ టీ20ల్లో టీమ్ఇండియా నుంచి సెంచరీ బాదిన తొలి బ్యాటర్​గా రైనా ఘనత సాధించాడు.

పాకిస్థాన్​ జర్నలిస్ట్‌కు రైనా స్ట్రాంగ్‌ కౌంటర్‌ - ఇచ్చి పడేశాడు! - Suresh Raina

'ఆ విషయం గురించి ధోనీకి అప్పుడే చెప్పా' - దూబాయ్ రూమ్​ కాంట్రవర్సీపై రైనా క్లారిటీ! - Suresh Raina CSK

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.