Cricketers Who Fade Away After 1 T20 Match : ఈ రోజుల్లో టీ20 క్రికెట్‌కి ఎక్కువ డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి చాలా మంది క్రికటర్లు టీమ్ఇండియాలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్‌లో రాణించి భారత జట్టులో అవకాశాలు పొందారు కూడా.
అయితే ఒక్కోసారి టీ20 క్రికెట్‌లో ఒక్క మ్యాచ్‌తోనూ అంచనాలు తలకిందులు అయిపోతాయి. ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్‌లో అదరగొట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కొందరు కేవలం ఒక్క మ్యాచ్‌కే పరిమితమయ్యారు. మళ్లీ టీమ్ఇండియా తరఫున టీ20 కోసం ఆడే అవకాశం రాలేదు. అటువంటి ఐదుగురు క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సందీప్ వారియర్
స్వింగ్ బౌలర్ సందీప్ వారియర్ కూడా ఒకే అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. 2021లో శ్రీలంకపై టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లలో 23 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత అతడికి మళ్లీ అవకాశం రాలేదు.
కరణ్ శర్మ
ఐపీఎల్‌లో లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ అద్భుతంగా రాణించాడు. భారీ అంచనాలతో 2014లో ఇంగ్లాండ్‌పై టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవల 28 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్ తీశాడు. అతడి నైపుణ్యాలను ప్రదర్శించడానికి టీమ్ఇండియాలో మరో అవకాశం లభించలేదు.
రిషి ధావన్
పేస్ బౌలర్ రిషి ధావన్, డొమెస్టిక్ క్రికెట్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. భారీ అంచనాలతో టీ20లో అరంగేట్రం చేశాడు. దురదృష్టవశాత్తు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒకే అవకాశం లభించింది. 2016లో జింబాబ్వేపై ఏకైక మ్యాచ్ ఆడాడు. ఇందులో నాలుగు ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి ఓ విక్కెట్ పడగొట్టాడు.
మయాంక్ మార్కండే
రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్ మయాంక్ మార్కండే ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనలతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2019లో ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ టీ20లోకి అడుగుపెట్టాడు. ఇందులో 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి ఒక్క విక్కెట్ కూడా తీయలేకపోయాడు. సామర్థ్యం నిరూపించుకోవడానికి మార్కండేకి మరో అవకాశం దక్కలేదు.
సుబ్రమణ్యం బద్రీనాథ్
స్టార్ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్, T20I అరంగేట్రం చేసే సమయానికి భారత డొమెస్టిక్ క్రికెట్‌లో సీనియర్ ప్లేయర్. బద్రీనాథ్ 2011లోనే వెస్టిండీస్‌పై టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు లభించే టీ20ల్లో బద్రీనాథ్ ఒక్క మ్యాచ్‌కే పరిమితం అయ్యాడు.
టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి - ఒకే మ్యాచ్‌లో 3 సూపర్ ఓవర్లు!
10 పరుగులకే ఆలౌట్- T20 హిస్టరీలో అత్యల్ప స్కోర్ - T20 Lowest Score