11 Players Bowling In T20 : టీ20 హిస్టరీలో సంచలనం నమోదైంది. ఒకే ఇన్నింగ్స్‌లో జట్టులోని 11 మంది ప్లేయర్లు బౌలింగ్‌కు దిగి అరుదైన రికార్డు నెలకొల్పారు. ఇందులో వికెట్ కీపర్ సైతం బౌలింగ్ చేయడం విశేషం. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా దిల్లీ- మణిపుర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన సంఘటన జరిగింది.
వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో దిల్లీ జట్టులోని 11 మంది ప్లేయర్లు బౌలింగ్ చేసి ఈ రికార్డు సృష్టించారు. కాగా ఇప్పటివరకు అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్లో జట్టులోని 11మంది ఒకే ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి.
వికెట్ కీపర్ సైతం!
మ్యాచ్‌లో ముందుగా మణిపుర్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో దిల్లీ జట్టులోని 11మంది ప్లేయర్లు బౌలింగ్‌కు దిగారు. వికెట్ కీపర్ ఆయూశ్ బదోనీ సైతం రెండు ఓవర్ల బౌలింగ్ చేశాడు. అయితే ఏ ఒక్కరూ 4 ఓవర్ల కోటా పూర్తి చేయలేదు. ఇప్పటివరకు టీ20 ఫార్మాట్లో ఒకే టీమ్‌లో గరిష్ఠంగా 9మంది బౌలింగ్ చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా 2014లో బంగాల్, కేరళ జట్లు, 2021లో మేఘాలయ జట్టు తొమ్మిది మంది బౌలర్లను ఉపయోగించింది. తాజాగా 11 మంది ప్లేయర్లతో బౌలింగ్ చేయించి దిల్లీ ఆ రికార్డు బ్రేక్ చేసింది.
Delhi become the first team to use all 11 players to bowl in T20 history. Concede 120/8 in 20 against Manipur at the Wankhede Stadium. No team has ever used more than 9 bowlers in an innings before. #SyedMushtaqAliTrophy pic.twitter.com/gKDf2PRgeo
— Lalith Kalidas (@lal__kal) November 29, 2024
ఇక ఈ మ్యాచ్‌లో దిల్లీ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన మణిపుర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. 121 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగింది దిల్లీ 6 వికెట్ల నష్టపోయి టార్గెట్ ఛేదించింది. దిల్లీ బ్యాటర్లలో యశ్ ధుల్ అర్ధశతకంతో రాణించాడు. దీంతో దిల్లీ ఈజీగా విజయం సాధించింది.
IPLలో కూడా!
ఐపీఎల్లో కొచ్చి టస్కర్స్ కేరళ, డెక్కన్ ఛార్జర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లఖ్ నవూ సూపర్ జెయింట్స్ జట్లు గరిష్ఠంగా తొమ్మిది మంది ప్లేయర్లతో ఒకే ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయించాయి.
13ఏళ్ల కుర్రాడికి రూ. 1.10 కోట్లు- అతి పిన్న వయస్కుడిగా రికార్డ్!