ETV Bharat / sports

రోహిత్‌, కోహ్లీకి ఇదే లాస్ట్- 11ఏళ్ల నిరీక్షణకు తెర దించుతారా? - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

Rohit Virat World Cup: సమ్మరీ: ఐసీసీ టోర్నీల్లో ట్రోఫీ కోసం టీమ్‌ఇండియా ఎదురుచూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఐసీసీ టైటిల్ గెలిచి 11 ఏళ్లు అయ్యింది. రోహిత్‌, కోహ్లీకి ఇదే చివరి టీ20 వరల్డ్​కప్ కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి జట్టులో సీనియర్లైన రోహిత్, కోహ్లీ అద్భుతంగా రాణించి ఈసారైనా టైటిల్ అందిస్తారని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు.

Rohit Virat World
Rohit Virat World (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2024, 6:50 AM IST

Rohit Virat World Cup: భారత క్రికెట్‌కి అద్భుతమైన సేవలు అందించిన దిగ్గజాలు చాలా మంది ఉన్నారు. అందులో ఇద్దరు ఇప్పటికీ క్రికెట్‌ ఆడుతున్నారు. వాళ్లే విరాట్‌ కోహ్లి, రోహిత్ శర్మ. త్వరలో మొదలు కానున్న టీ20 వరల్డ్‌ కప్‌లో దేశానికి ఐసీసీ కప్పు అందించాలనే లక్ష్యంతో ఇద్దరూ బరిలో దిగుతున్నారు. రోహిత్ తన ఇంటర్నేషనల్‌ టీ20 కెరీర్‌ని 2007లో బెల్‌ఫాస్ట్‌లో ప్రారంభించగా, కోహ్లీ ఏడాది తర్వాత దంబుల్లాలో అరంగేట్రం చేశాడు. ఈ మినీ వరల్డ్‌ కప్‌ ఈ స్టార్‌ ప్లేయర్స్‌కి లాస్ట్‌ సీజన్‌ కావచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. భారత్‌ ఐసీసీ ట్రోఫీ గెలిచి కూడా 13 ఏళ్లు అయిపోయింది. కోహ్లి, రోహిత్‌ ఈ సారి కప్పు సాధిస్తారా?

రోహిత్‌, కోహ్లీ కెరీర్‌
రానున్న T20 ప్రపంచ కప్ 2026కి, ఇండియా, శ్రీలంక ఆతిథ్యమిస్తాయి. అప్పటికి రోహిత్‌కి 39, కోహ్లీకి 37 ఏళ్లు వస్తాయి. వన్డే వరల్డ్‌ కప్‌ ఇంకా దూరంలో ఉంది. హై స్ట్రైక్ రేట్ కీలకమైపోయిన టీ20 ఫార్మాట్‌లో రోహిత్‌, కోహ్లి ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. అందుకే చాలా మంది, ఇది టీ20 వరల్డ్‌ కప్‌ గెలవడానికి చివరి అవకాశంగా భావిస్తున్నారు. చివరిసారి రోహిత్‌ 2007 టీ20 వరల్డ్‌ కప్‌, కోహ్లీ 2011లో వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచారు.

పరస్పర గౌరవం
కోహ్లీ, రోహిత్‌ చాలా కాలంగా టీమ్‌ఇండియా తరఫున కలిసి ఆడుతున్నారు. మూడు ఫార్మాట్‌లలో భారత్‌కి అద్భుత విజయాలు అందించారు. వీరిద్దరి మధ్య క్లోజ్‌ ఫ్రెండ్‌షిప్‌ కంటే పరస్పర గౌరవం ఎక్కువగా ఉంది. రోహిత్ బ్యాటింగ్ స్కిల్స్‌ను కోహ్లీ చాలా సార్లు ప్రశంసించాడు. మొదటిసారి రోహిత్‌ బ్యాటింగ్‌ని చూసినప్పుడు అతడు బాల్‌ని టైమ్‌ చేసే స్కిల్‌ని చూసి ఆశ్చర్యపోయానని కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో షేర్‌ చేసుకున్నాడు. కోహ్లీ ఫామ్‌ గురించి, స్ట్రైక్‌ రేట్ గురించి ఆరోపణలు వచ్చిన సమయంలో రోహిత్‌ సపోర్ట్‌గా నిలిచాడు.

ఇద్దరి ఆటే వేరు
కోహ్లీ, రోహిత్ ఆటతీరు డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే ఇద్దరూ తమ బ్యాటింగ్‌తో భారత క్రికెట్‌కు అద్భుతమైన విజయాలు అందించారు. దిగ్గజ ఆటగాడు సచిన్ తెందూల్కర్‌ మాదిరిగానే కోహ్లీ ఆటలోని అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్నాడు. మరోవైపు, రోహిత్ ప్రధానంగా వైట్-బాల్ క్రికెట్‌లో రాణించాడు. టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా మారాక, రోహిత్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా అదరగొట్టాడు.

టార్గెట్ అదే
వచ్చే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ అనుభవమే కీలకం. ఓపెనింగ్‌లో రోహిత్, తన నేచురల్‌ బిగ్- హిట్టింగ్ ఎబిలిటీతో అగ్రెసివ్‌ అప్రోచ్‌ని కంటిన్యూ చేయనున్నాడు. రోహిత్‌ క్రీజులో కుదురుకుంటే ఎంత ప్రమాదకరమే ప్రపంచ క్రికెట్‌ దేశాలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కోహ్లీ స్టైల్‌ వేరు అతడు ఇప్పుడు భారీ షాట్‌లు ఆడగలుగుతున్నాడు. అయితే, కోహ్లీ స్పిన్‌కు, ముఖ్యంగా లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్స్‌ని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. T20లలో స్పిన్‌లో అతని కెరీర్ స్ట్రైక్ రేట్ 120ల మధ్యలో ఉంది. కానీ ఈ సంవత్సరం ఐపీఎల్‌లో, స్లాగ్-స్వీప్‌ని ఉపయోగించి, స్పిన్నర్లపై తన స్ట్రైక్-రేట్‌ను 139కి పెంచుకున్నాడు. ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ టీమ్‌ ఇండియా ట్రోఫీ గెలవాలంటే, కోహ్లీ, రోహిత్‌ ప్రదర్శనలు కీలకం. చివరి ఎడిషన్‌లో ఇండియాకి కప్పు అందించి, ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

'గంటలు తరబడి మీటింగ్ రూమ్స్​లో!- రోహిత్ కెప్టెన్సీ మంత్ర ఏంటంటే? - Rohit Sharma Captaincy Mantra

అన్ని టోర్నీల్లోనూ భాగమైన ఆ ఇద్దరు ప్లేయర్స్​ ఎవరంటే? - T20 World cup 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.