ETV Bharat / sports

షబ్నిమ్ వరల్డ్​ రికార్డ్- మహిళల క్రికెట్​లో ఫాస్టెస్ట్​ బంతి - shabnim ismail bowling speed

Fastest Bowl In Women Cricket: 35 ఏళ్ల ముంబయి ఇండియన్స్ బౌలర్ షబ్నిమ్ ప్రపంచ రికార్డ్ కొట్టింది. రీసెంట్​గా దిల్లీతో జరిగిన మ్యాచ్​లో మహిళల క్రికెట్​లోనే అత్యంత ఫాస్టెస్ట్ బంతి సంధించింది.

Fastest Bowl In Women Cricket
Fastest Bowl In Women Cricket
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 10:02 AM IST

Updated : Mar 6, 2024, 12:26 PM IST

Fastest Bowl In Women Cricket: 2024 డబ్ల్యూపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. పురుషుల ఐపీఎల్​కు దాదాపు సమానంగా డబ్ల్యూపీఎల్​ కూడా వినోదాన్ని పంచుతోంది. ఈ క్రమంలో మహిళ క్రికెట్​ చరిత్రలో పలు రికార్డులు నమోదవుతున్నాయి. రీసెంట్​గా జరిగిన ముంబయి- దిల్లీ మ్యాచ్​లో ఓ వరల్డ్​ రికార్డ్ నమోదైంది. ముంబయి​ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ మహిళల క్రికెట్​లో అత్యంత వేగవంతమైన బంతి సంధించిన క్రికెటర్​గా నిలిచింది.

తొలి ఇన్నింగ్స్​ మూడో ఓవర్ వేసేందుకు ముంబయి కెప్టెన్ హర్మన్​ప్రీత్ కౌర్, షబ్నిమ్​కు బంతినిచ్చింది. ఈ ఓవర్​లో రెండో బంతిని షబ్నిమ్​ 132.1 kmph స్పీడ్​తో సంధించింది. మెరుపు వేగంతో దూసుకొచ్చిన బంతిని క్రీజులో ఉన్న దిల్లీ బ్యాటర్ మెగ్ లానింగ్ ఆడలేకపోయింది. దీంతో బంతి ఆమె ప్యాడ్​ను తాకింది. వెంటనే ఎల్​బీడబ్ల్యూకి ముంబయి ప్లేయర్లు అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్​గా ప్రకటించాడు. ఇక ఈ మ్యాచ్​లో షబ్నిమ్ ఓ వికెట్ దక్కించుకుంది. జోరుమీదున్న దిల్లీ ఓపెనర్ షఫాలీ వర్మ (28 పరుగులు, 12 బంతుల్లో)ను ఔట్ చేసింది.

ఇక మ్యాచ్ తర్వాత రికార్డు గురించి షబ్నమ్​ను ఆడగ్గా, 'బౌలింగ్ చేస్తుండగా బిగ్​స్ర్కీన్​ను చూడను' అని సమాధానం ఇచ్చింది. 16 ఏళ్ల కెరీర్​లో షబ్నమ్​ 317 వికెట్లు పడగొట్టింది. గతంలో కూడా ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డ్​లు షబ్నమ్​పైనే ఉన్నాయి. ఈమె 2016లో వెస్టిండీస్‌పై 128.0 kmph, 2022 మహిళల వరల్డ్​కప్​లో ఇంగ్లాండ్​పై 127.4 kmph, న్యూజిలాండ్​పై 127.1 వేగంతో బంతిని విసిరింది. తాజాగా షబ్నమ్​ 130+ kmph మార్క్ అందుకొని ఈ ఫీట్ సాధించిన తొలి మహిళా క్రికెటర్​గా రికార్డ్ సృష్టించింది. కాగా, మహిళల క్రికెట్​లో ఫాస్టెస్ట్ బాల్​ లిస్ట్​లో టాప్- 5లో నాలుగు షబ్నమ్​వే.

మ్యాచ్ విషయానికొస్తే, ముంబయిపై 29 పరుగుల తేడాతో దిల్లీ నెగ్గింది. దీంతో ఈ టోర్నీలో దిల్లీ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. 193 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 163- 8 పరుగులకే పరిమితమైంది. దిల్లీ బ్యాటర్లలో మెగ్ లానింగ్ (53), జెమిమా రోడ్రిగ్స్ (69*) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.

రఫ్పాడించిన రోడ్రిగ్స్- 29 పరుగుల తేడాతో దిల్లీ విజయం

WPL 2024 - దంచికొట్టిన ఆర్సీబీ - యూపీ వారియర్స్​పై విజయం

Last Updated : Mar 6, 2024, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.