Mayank Yadav LSG : భారత్‌లో ఐపీఎల్ పూర్తయిన వెంటనే జూన్‌లో యూఎస్, కరేబియన్‌లో ఐసీసీ టీ20 2024 వరల్డ్ కప్ మొదలుకానుంది. ఇప్పటికే టీమ్ ఇండియా కెప్టెన్‌గా రోహిత్‌ని బీసీసీఐ అనౌన్స్ చేసింది. మిగతా జట్టు ఎంపిక ఐపీఎల్ పర్ఫార్మెన్స్‌లపై ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాణిస్తున్న కొంత మంది యంగ్ ప్లేయర్‌లు కచ్చితంగా టీ20 టీమ్‌కి సెలక్ట్ అవుతారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇక మయాంక్ అగర్వాల్‌ను పలువురు క్రికెట్ దిగ్గజాలు కొనియాడుతున్నారు. భారత మాజీ పేసర్ కర్సన్ ఘావ్రీ, మయాంక్ యాదవ్‌ను అసాధారణ బౌలర్‌గా అభివర్ణించారు. అంతే కాకుండా అతడ్ని 'లంబీ రేస్ కా ఘోడా' (ఎక్కువ కాలం ఆడగలడు) అంటూ పేర్కొన్నారు. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఆయన ఈ మాట అన్నారు.
"అతడి వయస్సు కేవలం 21 సంవత్సరాలు. రాబోయే 10-12 సంవత్సరాల పాటు భారత క్రికెట్‌కు సేవ చేయగలడు. అతడు ఓ సంచలనాత్మక ప్లేయర్, టీమ్ఇండియాలో ఎవరూ తనలా బౌలింగ్ చేయలేదు. అతడ్ని తప్పకుండా అన్ని టోర్నమెంట్‌లను ఆడేలా చేయకుండా కాపాడుకోవాలి. టూ గుడ్ అని వర్ణించాలంటే అవి చాలా చిన్న పదాలైపోయి." అంటూ మయాంక్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.
మరోవైపు మాజీ స్టార్ క్రికెటర్ ఇయాన్ బిషప్ కూడా మయాంక్‌ను ట్విట్టర్‌లో ప్రశంసించాడు. మయాంక్‌ని ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్టుల లిస్టులో చేర్చాలని బీసీసీఐకి సూచించాడు. అలానే 'ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్టుల జాబితాలో ఆరో పేరును యాడ్ చేయడానికి వేరే ఏమీ చూడాల్సిన అవసరం లేదు.' అని పోస్టు చేశాడు. మయాంక్‌కి ఇండియా తరఫున టీ20 వరల్డ్ కప్ ఆడే సత్తా ఉందని అభిప్రాయపడ్డాడు. అలానే భారత మాజీ పేసర్ కర్సన్ ఘావ్రీ, భారత మాజీ ఆల్-రౌండర్, ఉమెన్స్ టీమ్ ప్రధాన కోచ్ W V రామన్ కూడా మయాంక్‌కి సపోర్ట్ చేశారు.
మయాంక్ రికార్డులు
మార్చి 30న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి, 3 వికెట్లు పడగొట్టాడు. ఏప్రిల్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తొలి రెండు మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న మొదటి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ రెండు మ్యాచ్‌లలో మయాంక్ 155 స్పీడ్‌ని మూడు సార్లు అందుకున్నాడు. 156.7 kmph స్పీడ్‌తో ఫాస్టెస్ట్ బాల్ డెలివరీ చేశాడు.
సూపర్ ఫామ్‌లో రియాన్ పరాగ్
ఈ ఐపీఎల్‌లో ఆర్‌ఆర్ బ్యాటర్ రియాన్ పరాగ్ అదరగొడుతున్నాడు. మూడు మ్యాచ్‌లో 181 పరుగులు చేసి, అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ అసిస్టెంట్ కోచ్, షేన్ బాండ్ పరాగ్‌ని టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్‌తో పోల్చాడు. 22 ఏళ్ల వయసులో చాలా మెచ్యూర్‌గా ఆడుతున్నాడని ప్రశంసించాడు. రాజస్థాన్ విజయాల్లో కీలకంగా మారిన పరాగ్‌ని టీ20 వరల్డ్ కప్‌కి సెలక్ట్ చేయాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోరుతున్నారు.
మయంక్ అవి బంతులా? బుల్లెట్లా?- లఖ్‌నవూకు స్పీడ్ గన్ దొరికేసింది! - Mayank Yadav IPL 2024