ETV Bharat / sports

'టైమ్‌లెస్‌ టెస్ట్‌' మ్యాచ్​ - ఏడు రోజులు టీమ్​ఇండియా ఆడిన టెస్ట్​ మ్యాచ్ ఇదే - Timeless Test Match - TIMELESS TEST MATCH

Longest Test Match in Cricket : ఇప్పుడంటే టెస్టు క్రికెట్‌ ఐదు రోజుల గడువుతో నిర్వహిస్తున్నారు. చెరో జట్టుకు రెండు ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం ఇస్తున్నారు. ఈ నిర్ణిష్ట సమయంలోపు ఫలితం తేలితే ఓకే, లేదంటే మ్యాచ్‌ డ్రాగా ప్రకటిస్తారు. అప్పుడప్పుడు రెండు, మూడు, నాలుగు రోజుల్లోనే కూడా ఈ ఆట పూర్తైపోతుంది. కానీ ఒకప్పుడు ఇలా కాదు. నిర్ణీత సమయం అంటూ ఉండేది కాదు. తొమ్మిది రోజుల వరకు ఆడిన సందర్భం కూడా ఉంది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ANI
Test cricket (source ANI)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 24, 2024, 11:25 AM IST

Longest Test : ప్రస్తుతం వరల్డ్​ వైడ్​గా పొట్టి క్రికెట్‌దే హవా కొనసాగుతోంది. టీ20, టీ10 లీగ్స్​కు బాగా క్రేజ్ పెరిగిపోవడం వల్ల సుదీర్ఘ ఫార్మాట్​ ఉనికి ప్రమాదంలో పడుతోంది. ప్లేయర్స్​ దీనికి అంతగా ప్రాధాన్యమివ్వట్లేదనే వాదన ఉంది. జనాదరణ కూడా తగ్గుతోంది. దీంతో భవిష్యత్​లో టెస్ట్ ప్రమాదంలో పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఈ ఫార్మాట్​కు ఊపిరి ఊదాలని ఐసీసీ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.

తొలి టెస్ట్ ఎప్పుడు జరిగింది?(First Test Match Year) - ఒకప్పుడు టెస్ట్ క్రికెట్​ అంటే బాగా క్రేజ్, ప్రాధాన్యత ఉండేది. అప్పట్లో రోజుల తరబడి ఆడేవారు. మధ్యలో విరామం తీసుకుంటూ వారమైనా, పది రోజులైనా రిజల్ట్​ తేలేదాకా ఆడుతూనే ఉండేవారు. 1877లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య మొదటి అధికారిక టెస్టు మ్యాచ్‌ జరిగింది. ఇక ప్రస్తుతం లంక - ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న టెస్ట్​ మ్యాచ్​ 2545ది. ఈ మధ్యలో టెస్ట్ క్రికెట్​లో ఎన్నో మార్పులు వచ్చాయి.

మొదటి 50 ఏళ్లలో అలా ఆడేవారు - మొదట్లో టెస్టు మ్యాచ్‌లో నిర్దిష్ట గడువంటూ లేకుండా రిజల్ట్ వచ్చే వరకు ఆడేవారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ప్రత్యర్థి స్కోరును అందుకునే దాకా బ్యాటింగ్ ఆడేవారు. ముందుగానే ఆలౌట్‌ అయితే మాత్రం మ్యాచ్‌ అయిపోయేది.

1877 నుంచి మొదటి 50 ఏళ్లలో ఆస్ట్రేలియాలో గడువు లేని టెస్టులు ఆడేవారు. ఇంగ్లాండ్​లో మూడు రోజుల టెస్టులు కూడా జరిగాయి. అయితే నిర్దిష్ట గడువంటూ లేని మ్యాచుల్లో ఏదైనా జట్టు గెలవాలి, లేదంటే మ్యాచ్‌ అయినా టైగా ముగియాలి. అప్పుడే మ్యాచ్ పూర్తయ్యేది.

ఇక వాతావరణం అనుకూలించకపోతే, లేదా మరే ఇతర కారణాలతో కొన్ని మ్యాచులు డ్రాగా నిలిచేవి. ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడం వంటివి చాలా అరుదు. వికెట్లు పడే వరకు బ్యాటింగ్‌ చేసేవారు. మధ్యలో ఒక రోజు విరామం తీసుకునేవారు. మళ్లీ రెండు రోజుల ఆట కొనసాగించేవారు. మళ్లీ విశ్రాంతి తీసుకునేవారు. మరో రోజు ఆటను కొనసాగించేవారు. అప్పట్లో బిజీ షెడ్యూల్‌ క్రికెట్ మ్యాచులు ఉండేవి కావు. మంచిగా క్రికెట్‌ను ఆస్వాదిస్తూ ఆడుకునేవారు.

మొత్తంగా 1877 నుంచి 1939 వరకు ఇలాంటివి నిర్దిష్ట గడువులేని 100 టెస్టు మ్యాచులు జరిగితే అందులో 96 మ్యాచుల్లో రిజల్ట్​ తేలింది. కేవలం నాలుగు మ్యాచులు మాత్రమే డ్రాగా ముగిశాయి.

8 రోజుల పాటు సాగిన మ్యాచ్(TimeLess Test Match)​ - ఇక రెండో ప్రపంచ యుద్ధం వరకు ఆస్ట్రేలియాలోనూ ఇలాంటి మ్యాచులే జరిగాయి. 1929లో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్​ 8 రోజుల పాటు సాగింది.

మొత్తంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా మాత్రమే ఇలా నిర్దిష్ట గడువులేని టెస్ట్​ మ్యాచులు ఆడాయి. 1947లో ఆస్ట్రేలియా - భారత్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఏడు రోజుల్లో ముగిసింది. మధ్యలో ఒక రోజు విరామం తీసుకున్నారు. అంటే అది ఆరు రోజుల టెస్టు. అప్పట్లో ఓవర్‌కు 8, 6, 5 బంతుల చొప్పున ఉండేవి.

9 రోజుల ఆట, నిర్దష్ట గడువు లేని చివరి ఆట(Longest Test in cricket) - డర్బన్‌ వేదికగా 1939లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఇది అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా అంటే ఎక్కువ రోజుల పాటు సాగిన ఆటగా చరిత్రలో నిలిచిపోయింది. ఇది 10 రోజుల షెడ్యూల్‌ మ్యాచ్‌. 9 రోజుల పాటు ఆట సాగింది. మార్చి 3న ఆరంభమైంది. అలా 4, 6, 7, 8, 9, 10, 13, 14 తేదీల పాటు ఆట కొనసాగింది. వాస్తవానికి 11వ తేదీన కూడా మ్యాచ్​ సాగాల్సి ఉండగా, వర్షం వల్ల కుదరలేదు.

మధ్యలో 5, 12వ తేదీల్లో అంటే రెండు రోజుల పాటు విరామం తీసుకున్నారు. చివరకు 14వ తేదీన సాయంత్రానికి మ్యాచ్ ముగిసింది. అప్పుడు విజయానికి ఇంగ్లాండ్‌ 42 పరుగుల దూరంలో ఉంది. అయితే తర్వాతి రోజు పడవలో స్వదేశానికి ఇంగ్లాండ్‌ బయలు దేరాల్సి ఉండటం వల్ల డ్రా చేశారు. ఈ మ్యాచ్​లో దక్షిణాఫ్రికా 530, 481 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ 316, 654/5 పరుగులు చేసింది. నిర్దేశిత గడువు లేకుండా సాగిన చివరి టెస్టు కూడా ఇదే. మొత్తంగా ఈ మ్యాచ్​ 43 గంటల 16 నిమిషాల పాటు సాగింది. మొత్తంగా 1981 పరుగులు ఈ పోరులో నమోదు అయ్యాయి.

ఒక్కో జట్టు ఒక్కోలా, అప్పటి నుంచే 5 రోజుల ఆట - ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్థాన్‌, న్యూజిలాండ్ - ఇలా ఒక్కో జట్టు ఒక్కోలా ఆడేది. కొన్ని సిరీస్‌ల్లో మ్యాచులు 3 రోజులు ఆడితే మరికొన్ని సిరీస్‌ల్లో 4 నుంచి 6 రోజుల వరకు ఉండేది.

1930 నుంచి ఇంగ్లాండ్‌ - ఆస్ట్రేలియా మధ్య యాషెస్‌ సిరీస్‌ టెస్టులు 4 రోజుల ఆటగా మొదలయ్యాయి. 1948 నుంచి ఐదు రోజుల ఆటగా మారింది.

టీమ్​ఇండియా ఆడిన తొలి టెస్టు 1932లో(TeamIndia First Test Match). ఇంగ్లాండ్‌లో ఆడింది. అప్పుడు అది మూడు రోజుల ఆటే.

స్వదేశంలో భారత్ ఆడిన తొలి సిరీస్‌ 1933-34లో. ఇంగ్లాండ్‌తోనే ఆడింది. ఈ మ్యాచ్‌లన్నింటినీ నాలుగు రోజుల గడువుతో నిర్వహించారు. ఆ తర్వాత భారత్​ 5 రోజుల ఆట ఆడటం మొదలుపెట్టింది.

1973లో పాకిస్థాన్‌ - న్యూజిలాండ్ మధ్య జరిగిన సిరీస్‌లో నాలుగు రోజుల మ్యాచులు సాగాయి. ఆ తర్వాత అన్ని జట్లు కూడా 5 రోజుల మ్యాచులు ఆడటం ప్రారంభించాయి. అయితే 2017లో జింబాబ్వే - దక్షిణాఫ్రి, గతేడాది ఐర్లాండ్‌ - ఇంగ్లాండ్‌ 4 రోజుల టెస్టులు ఆడాయి.

రూ.125 కోట్ల నిధులు(Test Cricket 125 Crores ICC Budget) - ప్రస్తుతం టెస్ట్ క్రికెట్​ ఉనికి ప్రమాదంలో పడింది. దీంతో ఐసీసీ ఈ సంప్రదాయ ఫార్మాట్‌ను కాపాడేందుకు తాజాగా రూ.125 కోట్ల నిధులను కేటాయించిందని సమాచారం. మ్యాచ్‌ ఫీజులను పెంచి, తద్వారా ఈ ఫార్మాట్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడేలా ప్రోత్సహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలిసింది. ఒక టెస్టు మ్యాచ్‌ ఆడితే రూ.8.4 లక్షలు ఫీజుగా ఇవ్వడంతో పాటు టెస్టుల నిర్వహణకు ఇబ్బంది పడుతున్న దేశాలకు ఈ నిధి ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించనున్నారు.

టెస్టు సిరీస్‌ - అసలేంటీ 'రెస్ట్‌ డే'? - What is Rest Day in Cricket

క్రికెట్ హిస్టరీలో 'లాంగెస్ట్ టెస్టు'- 9రోజులు సాగిన ఆట - Longest Test Match

క్రికెట్​కు శిఖర్​ ధావన్ గుడ్​బై- రిటైర్మెంట్​ ప్రకటించిన 'గబ్బర్'​ - Shikhar Dhawan Retirement

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.