Phil Salt vs West Indies T20: 2024 టీ20 వరల్డ్‌కప్ సూపర్ 8ను ఇంగ్లాండ్ గ్రాండ్‌గా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (87 పరుగులు; 47బంతుల్లో: 7x4, 5x6) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ విజయం కట్టబెట్టాడు. అయితే టీ20 ఫార్మాట్లో విండీస్‌పై సాల్ట్‌కు ఘనమైన రికార్డు ఉంది.
ఒకే ఓవర్లో 30 పరుగులు: ఛేదనలో సాల్ట్ ఓ దశలో 37 బంతుల్లో 49 పరుగులతో ఉన్నాడు. అప్పటికి ఇంగ్లాండ్ విజయానికి 30 బంతుల్లో 40 పరుగులు కావాలి. ఇక రొమారియో రెపర్డ్స్ వేసిన 16వ ఓవర్లో సాల్ట్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ ఓవర్లో వరుసగా 4,6,4,6,6,4 బాది ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. దీంతో టీమ్ఇండియా విక్టరీ దాదాపు ఖరారైంది. అయితే చివరి 10 బంతుల్లో 38 పరుగులు బాదాడు. ప్రత్యర్థి విండీస్ అంటేనే చాలు సాల్ట్ ఇలాగే చెలరేగిపోతున్నాడు. విండీస్‌పై సాల్ట్ గణాంకాలపై ఓ లుక్కేద్దాం.
- అంతర్జాతీయ టీ20ల్లో సాల్ట్ ఇప్పటివరకు 26 ఇన్నింగ్స్‌ల్లో 844 పరుగులు చేయగా అందులో 50 శాతానికి పైగా విండీస్‌పై బాదినవే కావడం విశేషం.
- వెస్టిండీస్‌పై సాల్ట్ ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో సాల్ట్ 68.28 సగటు, 186.71 స్ట్రైక్ రేట్‌తో 487 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌ల్లో సాల్ట్ సగటున ప్రతి నాలుగు బంతులకొక ఫోర్ లేదా సిక్స్ బాదడం విశేషం.
- ఇంటర్నేషనల్ టీ20ల్లో సాల్ట్ బాదిన 2 సెంచరీలు కూడా విండీస్‌పైనే కావడం గమనార్హం. అత్యధికం 119 పరుగులు. ఇక ఖాతాలో మూడు హాఫ్ సెంచరీలు ఉండగా, అందులో రెండు వెస్టిండీస్‌పై సాధించినవే.
- విండీస్‌పై అత్యధిక సిక్స్‌లు బాదిన ఇంగ్లాండ్ బ్యాటర్ కూడా సాల్టే. అతడు మొత్తంపై 32 సిక్స్‌లు నమోదు చేశాడు.
- ఇంగ్లాండ్- విండీస్ ఫైట్‌లో అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్ సాల్ట్. అతడు ఇప్పటివరకు 487 పరుగులు బాదాడు. సాల్ట్ తర్వాత అలెక్స్ హేల్స్ (423 పరుగులు), క్రిస్ గేల్ (422 పరుగులు), నికోలస్ పూరన్ (420), జాస్ బస్టర్ (390) వరుసగా ఉన్నారు.
సూపర్ 8లో విండీస్‌కు షాక్- గ్రాండ్ విక్టరీ కొట్టిన ఇంగ్లాండ్ - T20 World Cup 2024
విలియమ్సన్ షాకింగ్ డెసిషన్- T20 ప్రపంచకప్ ప్రదర్శనే కారణం! - T20 World Cup 2024