ETV Bharat / sports

WTCలో రూట్ హవా- కెరీర్​లో మరో మైల్​స్టోన్- సచిన్​ రికార్డుకు అతి చేరువలో - Joe Root WTC - JOE ROOT WTC

Joe Root WTC 5000 Runs : ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ కెరీర్​లో మరో ఘనత సాధించాడు. సచిన్ రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు.

Joe Root WTC 5000 Runs
Joe Root WTC 5000 Runs (Source: AP (Left), Getty Images (Right))
author img

By ETV Bharat Sports Team

Published : Oct 9, 2024, 11:06 AM IST

Joe Root WTC 5000 Runs : ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ కెరీర్​లో మరో ఘనత సాధించాడు. వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్​లో 5 వేలు పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ప్రపంచంలోనే ఈ మైలురాయి అందుకున్న తొలి బ్యాటర్​గా రూట్ రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్​తో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘతన అందుకున్నాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 59 మ్యాచ్​లు ఆడిన రూట్ 51.59 సగటుతో 5005 పరుగులు చేశాడు. అందులో 16 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

కాగా, రూట్ తర్వాత డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబూషేన్ (3904 పరుగులు) ఉన్నాడు. అంటే తొలి ప్లేస్​లో ఉన్న రూట్​, రెండో స్థానంలో ఉన్న లబూషేన్​కు 1000+ పరుగుల తేడా ఉంది.

సీజన్ల వారిగా రూట్ పరుగులు

  • 2019-21 - 1660 పరుగులు- 3 సెంచరీలు
  • 2021-23 - 1915 పరుగులు- 8 సెంచరీలు
  • 2023-25- 1400* పరుగులు- 5 సెంచరీలు

డబ్ల్యూటీసీలో టాప్ రన్ స్కోరర్స్​

జో రూట్ఇంగ్లాండ్ 59 మ్యాచ్​లు5005 పరుగులు
మార్నస్ లబూషేన్ఆస్ట్రేలియా 453904
స్టీవ్ స్మిత్ఆస్ట్రేలియా 453486
బెన్ స్టోక్స్ఇంగ్లాండ్ 483101
బాబర్ ఆజమ్ పాకిస్థాన్ 322755

సచిన్ రికార్డుకు చేరువలో
2024లో రూట్ అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది (క్యాలెండర్ ఇయర్)లో రూట్ ఇప్పటికే 1000 టెస్టు పరుగులు పూర్తి చేశాడు. టెస్టుల్లో ఏడాదిలో 1000+ పరుగులు చేయడం రూట్​ కెరీర్​లో ఇది ఐదోసారి. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాలు బ్రియన్ లారా, మ్యాథ్యూ హెడెన్, జాక్వెస్ కల్లిస్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, అలిస్టర్ కూస్ సరసన చేరి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీళ్లంతా కూడా తమతమ టెస్టు కెరీర్​లో ఐదుసార్లు 1000+ పరుగులు చేశారు. కాగా, ఈ లిస్ట్​లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ టాప్​లో ఉన్నాడు. సచిన్ తన కెరీర్​లో ఆరుసార్లు ఈ ఘనత సాధించాడు. రూట్ ఇదే ఫామ్ కొనసాగిస్తే, సచిన్​ రికార్డును వచ్చే ఏడాదే సమం చేసే ఛాన్స్ ఉంది.

కాగా, ఓవరాల్​గా రూట్ తన టెస్టు కెరీర్​లో 147 మ్యాచ్​లు ఆడాడు. అందులో 50+ యావరేజ్​తో ఇప్పటివరకు 12400 పరుగులు చేశాడు. అందులో 34 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Eng vs Pak 1st Test 2024: ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్​లో 96-1 స్కోర్​తో ఉంది. క్రీజులో రూట్ (32), జాక్ క్రాలీ (64) ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 556-10భారీ స్కోర్ నమోదు చేసింది.

జో రూట్ టెస్ట్​ సెంచరీ - ఆ ముగ్గురి రికార్డులను బ్రేక్ చేసిన స్టార్ బ్యాటర్ - Joe Root Test Century

అన్​స్టాపబుల్ 'రూట్ '- సంగక్కర రికార్డ్ బ్రేక్- ఖాతాలో మరో మైల్​స్టోన్ - Eng vs SL Test Series

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.