Duleep Trophy 2024: 2024 దులీప్ ట్రోఫీ గురువారం (సెప్టెంబర్ 5) నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లో ఈ మెగా టోర్నీ జరగనుంది. 61వ ఎడిషన్ దులీప్ ట్రోఫీ ఈసారి కొత్త ఫార్మాట్‌లో జరగనుంది. గతంలో దులీప్ ట్రోఫీలో ఆరు జోన్ల జట్లు తలపడగా, ఈసారి మాత్రం నాలుగు జట్లు మాత్రమే ఆడనున్నాయి. ఇండియా A, B, C, D జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొత్తం నాలుగు జట్లు సెప్టెంబర్ 5 నుంచి 8 వరకూ తలపడతాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో A x B జట్టుతో తలపడనుండగా, అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియంలో ఇండియా C x D జరగనుంది.
రౌండ్- రాబిన్ విధానంలో ఈ లీగ్ మ్యాచులు జరగనున్నాయి. ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. ఏ జట్టు ఎక్కువ పాయింట్లు సాధిస్తుందో ఆ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుంది. ఇండియా A జట్టుకి కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వ్యవహరిస్తుండగా, ఇండియా B జట్టును అభిమన్యు ఈశ్వరన్ నడిపించనున్నాడు. ఇండియా C జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ఇండియా D జట్టుకు శ్రేయస్ అయ్యర్ నేతృత్వం వహించనున్నాడు.
2024 దులీప్ ట్రోఫీలో స్టార్ ఆటగాళ్లు బరిలో దిగుతున్నారు. యశస్వీ జైస్వాల్, అర్ష్‌దీప్ సింగ్, కెఎల్ రాహుల్, శివమ్ దూబే, మయాంక్ అగర్వాల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యశ్ దయాల్, ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతున్నారు. వీరితో పాటు ప్రతిభావంతులైన దేశవాళీ క్రికెటర్లు కూడా దులీప్ ట్రోఫీలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
- షెడ్యూల్: సెప్టెంబర్ 5 - సెప్టెంబర్ 22
- ఎక్కడ: బెంగళూరు, అనంతపురం
- సమయం: 9:30 AM గంటలకు ప్రారంభం
- ప్రత్యక్ష ప్రసారం: జియో సినిమా, Sports18 - 3, Sports18 Khelలో
తొలి మ్యాచ్ | ఇండియా A vs ఇండియా B | సెప్టెంబర్ 05- 08 | బెంగళూరు |
రెండో మ్యాచ్ | ఇండియా C vs ఇండియా D | సెప్టెంబర్ 05- 08 | అనంతపూర్ |
మూడో మ్యాచ్ | ఇండియా A vs ఇండియా D | సెప్టెంబర్ 12- 15 | అనంతపూర్ |
నాలుగో మ్యాచ్ | ఇండియా B vs ఇండియా C | సెప్టెంబర్ 12- 15 | అనంతపూర్ |
ఐదో మ్యాచ్ | ఇండియా B vs ఇండియా D | సెప్టెంబర్ 19- 22 | అనంతపూర్ |
ఆరో మ్యాచ్ | A vs ఇండియా ఇండియా C | సెప్టెంబర్ 19- 22 | అనంతపూర్ |
జట్లు:
ఇండియా A జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వాత్ కావరప్ప , కుమార్ కుశాగ్రా, శాశ్వత్ రావత్.
ఇండియా B జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తీ, ఎన్ జగదీసన్.
ఇండియా C జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయల్, సందీప్ వారియర్.
ఇండియా D జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యష్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సేన్‌గుప్తా, కెఎస్ భరత్, సౌరభ్ కుమార్.
దులీప్ ట్రోఫీ స్క్వాడ్స్ ఔట్ - రోహిత్, కోహ్లీ నో ఇంట్రెస్ట్! - Duleep Trophy 2024