ETV Bharat / sports

దులీప్ ట్రోఫీలో ఇండియా C బోణీ- 7 వికెట్లతో సత్తా చాటిన మానవ్ సుతార్ - Duleep Trophy 2024

author img

By ETV Bharat Sports Team

Published : Sep 7, 2024, 4:01 PM IST

Updated : Sep 7, 2024, 4:06 PM IST

India C vs India D Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా C జట్టు బోణీ కొట్టింది. ఇండియా Dతో జరిగిన మ్యాచ్​లో 4 వికెట్ల తేడాతో నెగ్గింది.

Duleep Trophy
Duleep Trophy (Source: Getty Images)

India C vs India D Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా C జట్టు బోణీ కొట్టింది. ఇండియా Dతో జరిగిన మ్యాచ్​లో 4 వికెట్ల తేడాతో నెగ్గింది. శనివారం 206/8 స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇండియా D 236 పరుగులకు ఆలౌటైంది. ఇక 233 పరుగుల టార్గెట్​ను ఇండియా C 6 వికెట్లు కోల్పోయి 61 ఓవర్లలో ఛేదించింది. రుతురాజ్‌ గైక్వాడ్ (46 పరుగులు), ఆర్యన్ జుయల్ (47 పరుగులు), రజత్ పటీదార్‌ (44 పరుగులు) రాణించారు. చివర్లో అభిషేక్ పొరెల్ (35* పరుగులు), మానవ్ సుతార్‌ (19* పరుగులు) ఆకట్టుకున్నారు. సారన్ష్ జైన్ 4, అక్షర్ పటేల్ 1 వికెట్ దక్కించుకున్నారు. కాగా, రెండో ఇన్నింగ్స్​లో 7 వికెట్లతో సత్తా చాటిన (ఇండియా C) మానవ్ సుతార్​కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

సుతార్ అదరహో
ఇండియా Cకి ప్రాతినిధ్యం వహిస్తున్న మానవ్ సుతార్ బంతితో అదరగొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్​లో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. 19.1 ఓవర్లు బౌలింగ్ చేసిన మానవ్ 7 వికెట్లతో సత్తా చాటాడు. అందులో 7 మెయిడెన్ ఓవర్లు ఉండడం విశేషం. ఇక తొలి ఇన్నింగ్స్​లోనూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన మానవ్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్​లో మానవ్ మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు.

కాగా, తొలి ఇన్నింగ్స్​లో ఇండియా D 164 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ (86 పరుగులు; 118 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) మినహా మిగతావారెవరూ పెద్దగా రాణించలేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9 పరుగులు) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. అటు ఇండియా D తొలి ఇన్నింగ్స్​లో 168 పరుగులకు కుప్పకూలింది. ఇంద్రజీత్ (72 పరుగులు; 149 బంతుల్లో 9 ఫోర్లు) రాణించాడు. అభిషేక్ పొరెల్ (34) ఆకట్టుకున్నాడు.

సంక్షిప్త స్కోర్లు

దులీప్ ట్రోఫీకి మన స్టార్లు రెడీ- లైవ్ మ్యాచ్​ ఎక్కడ చూడాలో తెలుసా? - Duleep Trophy 2024

డొమెస్టిక్ టోర్నీలో రోహిత్, విరాట్- స్టార్ల రాకతో దేశవాళీ క్రికెట్​లో ఫుల్ జోష్! - Rohit Sharma Duleep Trophy

Last Updated : Sep 7, 2024, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.