DSP Mohammed Siraj : బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ను టీమ్‌ఇండియా అత్యంత పేలవంగా ప్రారంభించింది. తొలి రోజు ఆట వర్షార్పణం కాగా, గురువారం రెండో రోజు ఆట మొదలైంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ టపటపా వికెట్లు కోల్పోయింది. కేవలం 46 పరుగులకే ఆలౌటై, చెత్త రికార్డు మూటగట్టుకుంది. స్వదేశంలో టెస్టుల్లో భారత్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. దీంతో రెండో సెషన్‌లోనే భారత్ బౌలింగ్ మొదలైంది. ఈ సమయంలో న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే, భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
కాన్వే వర్సెస్ సిరాజ్
ఓపెనర్లు టామ్ లేథమ్, డెవాన్ కాన్వే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇద్దరూ భారత్ చేసిన స్కోర్‌ను సులువుగా అధిగమించారు. అయితే 15వ ఓవర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో కాన్వే బౌండరీ బాదిన తర్వాత ఈ వాగ్వాదం జరిగింది. విసుగు చెందిన సిరాజ్ కాన్వేను ఏవో మాటలు అన్నాడు. అయినా కాన్వే నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రశాంతంగా ఉండాలని, మ్యాచ్‌పై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడు. సిరాజ్ బౌలింగ్‌లో కాన్వే అద్భుతమైన షాట్‌తో బౌండరీ సాధించాడు. ఆ తర్వాత బంతిని డిఫెన్స్ ఆడి బ్లాక్ చేశాడు. దీనికి సిరాజ్ అసహనానికి గురైనట్లు అనిపించింది.
DSP అని మర్చిపోకండి!
ఆ సమయంలో కామెంటేటర్, క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా సిరాజ్ ఎంపికైన విషయాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. 'అతడు ఇప్పుడు డీఎస్సీ అని మర్చిపోవద్దు. అతనికి సహచరులు సెల్యూట్ చేశారా? లేదా?' అని అన్నారు. మరోవైపు క్రౌడ్ కూడా సిరాజ్ బౌలింగ్ చేస్తుండగా 'DSP','DSP' అని అరిచారు.
'DSP, DSP' chants for Mohammad Siraj. pic.twitter.com/bT3jyVrPl3
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 17, 2024
Timeline:
— 𝐒𝐞𝐫𝐠𝐢𝐨 (@SergioCSKK) October 17, 2024
Siraj Sledges Conway
Crowd chants CSK CSK
Conway smashes Siraj for boundaries
Conway winks back at Siraj
Crowd goes beserk
Never mess with CSK Players🤫 pic.twitter.com/bd8otQAcBT
కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్
భారత్ మొదటి ఇన్నింగ్స్ కేవలం 31.2 ఓవర్లలో ముగిసింది. చాలా మంది బ్యాటర్లు పరుగుల ఖాతా ఓపెన్ చేయడానికి కూడా కష్టపడ్డారు. రిషబ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఏకంగా ఐదుగురు భారత బ్యాటర్లు సున్నా పరుగులకు అవుట్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లు భారత్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. మాట్ హెన్రీ కేవలం 15 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. విలియం ఓ'రూర్క్ కూడా నాలుగు వికెట్లు పడగొట్టి భారత్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
5 డకౌట్లు, 46 పరుగులకే ఆలౌట్ - 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు
నలుగురు భారత బ్యాటర్లు డకౌట్, 34 రన్స్‌కే 6 వికెట్లు డౌన్ - 1969 తర్వాత ఇదే తొలిసారి