T20 World cup 2024 Pitch : టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా జరిగే లీగ్ దశలో టీమ్ఇండియా తమ మ్యాచులన్నీ అమెరికాలోనే ఆడనుంది. ఇప్పటికే రోహిత్ సేన న్యూయార్క్ చేరుకుని ప్రాక్టీస్ కూడా చేస్తోంది. జూన్ 5న ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అంతకన్నా ముందే బంగ్లాదేశ్‌తో జూన్ 1 వార్మప్ మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ అంతర్జాతీయ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక. అయితే మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ మైదానంలోని పిచ్‌ను పరిశీలించారు. ఈ మైదానంలో డ్రాప్- ఇన్ పిచ్ ఉపయోగించారు. ఈ పిచ్ బ్యాటర్లకు అనూకూలించేలా ఉందని సమాచారం.
డ్రాప్-ఇన్ పిచ్ అంటే? - బెస్ట్ పిచ్ తయారీకి స్టేడియంలోని నేల అనువుగా లేకపోతే డ్రాప్-ఇన్ పిచ్‌లను ఉపయోగిస్తారు. పిచ్‌ను బయట తయారు చేసి ఆ తర్వాత దాన్ని మ్యాచ్ జరిగే స్టేడియానికి తరలిస్తారు. అనంతరం పిచ్‌ను నిర్ణీత ప్రదేశంలో అమరుస్తారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ), పెర్త్‌లోని కొన్ని స్టేడియాలు, అడిలైడ్ ఓవల్ కూడా ఇలాంటి పిచ్లే. ఈ మైదానాల్లో కేవలం క్రికెట్ మ్యాచ్‌లే కాదు ఫుట్‌బాల్, రగ్బీ మ్యాచ్‌లు కూడా నిర్వహిస్తారు. మ్యాచ్‌లు ఉన్న సమయంలో కస్టమైజ్డ్ ట్రక్‌లో పిచ్‌లను తీసుకొచ్చి ప్రత్యేకమైన యంత్రం సాయంతో పిచ్‌ను డ్రాప్ చేస్తారు. మ్యాచ్‌లు ముగియగానే అదే మెషీన్ సాయంతో దానిని అక్కడి నుంచి తరలిస్తారు.న్యూయార్క్ మైదానంలో వాడేందుకు 10 డ్రాప్ ఇన్ పిచ్‌లను తయారు చేశారు. ఇందులో నాలుగు మ్యాచ్‌ల కోసం, మిగతావి వార్మప్ మ్యాచ్‌ల కోసం వినియోగించనున్నారు.
తయారు చేసింది ఎవరంటే? - అమెరికాలోకి మొదటిసారి మేజర్ ఈవెంట్ జరుగనున్న నేపథ్యంలో గతేడాది నుంచే పిచ్‌ల తయారీ చేయడం ప్రారంభించారు. ఈ డ్రాప్-ఇన్ పిచ్‌లు తయారు చేయడంలో నిపుణుడైన అడిలైడ్ ఓవల్ క్యురేటర్ డామియన్ హోతో ఐసీసీ ఒప్పందం చేసుకుంది. ట్రేలలో పిచ్ మిశ్రమాన్ని రెడీ చేసి కంటైనర్ల ద్వారా వాటిని న్యూయార్క్‌కు రవాణా చేశారు. మైదానంలో ఈ ట్రేలను అమర్చి పిచ్‌ను సిద్ధం చేశారు.
ఈ పిచ్‌ల గురించి అడిలైడ్ ఓవల్ హెడ్ ప్రధాన క్యూరేటర్ డామియన్ హో మాట్లాడుతూ - "అనుకున్నట్లుగా పక్కా టీ20 తరహా పిచ్‌లు తయారు చేశామని అనుకుంటున్నాను. పేస్, బౌన్స్‌కు అనుకూలించడంతో పాటు పరుగులు రాబట్టేందుకు కూడా ఈ పిచ్ అనుకూలంగా ఉంటుంది. బ్యాటర్లు షాట్లు ఆడేందుకు వీలుగానే ఉంటుంది" అని అన్నారు.
అమెరికాలో టీ20 వరల్డ్‌కప్ వేదికలు ఇవే? - న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ కౌంటీ స్టేడియం, డల్లాస్‌లోని టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రయరీ క్రికెట్ స్టేడియం. లీగ్ దశలో న్యూయార్క్ స్టేడియంలో ఎనిమిది మ్యాచ్‌లు జరుగనున్నాయి. హై వోల్టేజ్ భారత్ పాకిస్థాన్(జూన్ 9)కు కూడా ఇదే వేదిక.
వరల్డ్ కప్ - తొలి మ్యాచ్‌కు భారీ అడ్డంకి! - T20 World Cup 2024
ఈ ప్లేయర్లు యమ డేంజరెస్ - భయపెట్టేందుకు వచ్చేస్తున్నారు! - T20 WorldCup 2024