ETV Bharat / sports

గంభీర్‌ Vs కోహ్లీ - దినేశ్‌ కార్తిక్‌ అలా అనేశాడేంటి? - Dinesh Karthik RCB

Dinesh Karthik RCB : ఐపీఎల్ 17వ సీజన్​లో భాగంగా బెంగళూరు - కోల్‌కతా జట్ల మధ్య నేడు (మార్చి 29) మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్​ కోసం అందరూ ఎదురుచూస్తున్న వేళ నెట్టింట విరాట్-గంభీర్‌ల కాంట్రవర్సీ మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ఇదే ఆర్సీబీ ప్లేయర్ దినేశ్ కార్తిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే ?

Dinesh Karthik RCB
Dinesh Karthik RCB
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 4:13 PM IST

Dinesh Karthik RCB : గతేడాది ఐపీఎల్​ సీజన్​లో బెంగళూరు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ- మాజీ ప్లేయర్ గౌతమ్​ గంభీర్​కు మధ్య జరిగిన వివాదం ఎంతటి కాంట్రవర్సీలను సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో విరాట్‌ కోహ్లీ-గంభీర్ ఫ్యాన్స్‌ రెండు వర్గాలుగా విడిపోయి సోషల్‌ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు.

వివాదానికి కారణం గంభీర్ అని కోహ్లీ ఫ్యాన్స్, కాదు కోహ్లీనేల అంటూ గంభీర్ అభిమానులు వాగ్వాదానికి దిగారు. ఇక ఈ వివాదంపై మాజీ క్రికెటర్లు అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇద్దరి వ్యక్తిగత విభేదాల కారణంగా ఆటకున్న గౌరవాన్ని మంటగలపొద్దంటూ హితువు పలికారు. ఆటలో భావోద్వేగాలు సహజమని, కానీ మీరు వాటిని ఇక్కడచూపించకూడదంటూ మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా సూచించారు. అయితే ఆ తర్వాత ఈ మ్యాటర్ కాస్త సద్దుమణిగినట్లే అనిపించింది.

ఇప్పుడు అదే వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఐపీఎల్ 17వ సీజన్​లో భాగంగా నేడు (మార్చి 29) బెంగళూరు-కోల్‌కతా జట్లు తలపడనుంది. ఈ నేపథ్యంలో గంభీర్‌-కోహ్లీ కాంట్రవర్సీ మరోసారి సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ అప్పడు జరిగినదాన్ని గుర్తు చేస్తూ మీమ్స్ అప్​లోడ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై ఆర్సీబీ ప్లేయర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఓ ఇంటర్వ్యూలో ఫన్నీగా స్పందించాడు.

ఈ మ్యాచ్‌లో ఎవరి మధ్య యుద్ధం బావుంటుందంటూ యాంకర్ అడగ్గా, విరాట్‌ కోహ్లీ-గౌతమ్​ గంభీర్‌ మధ్య పోరు బావుంటుందంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ vs గౌతమ్ గంభీర్, మిచెల్ స్టార్క్ వర్సెస్‌ గ్లెన్ మాక్స్‌వెల్, వరుణ్ చక్రవర్తి వర్సెస్‌ దినేష్ కార్తీక్ మధ్య ఆసక్తికర పోరు జరగనుందంటూ సరదాగా అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది.

ఆర్సీబీ తుది జట్టు (అంచనా) : విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేశ్​ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్, యశ్​ దయాల్
సబ్​స్టిట్యూట్ (అంచనా) : మహిపాల్ లోమ్రోర్

జైపుర్​లో రాజస్థాన్ విక్టరీ- రియాన్ పరాగ్ ఇన్నింగ్స్​ అదుర్స్ - RR VS DC IPL 2024

ఇది సన్​రైజర్స్​ జట్టేనా?- ఆ సెంటిమెంట్ వర్కౌటైతే కప్పు పక్కా హైదరాబాద్​దే! - Sunrisers Hyderabad IPL

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.