Virat Kohli Biopic : గ్రూప్ దశలో అదరగొట్టిన రోహిత్ సేన ఇప్పుడు సూపర్ 8 పోరుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 20న అఫ్గానిస్థాన్‌తో తలపడేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. అయితే ఈ మ్యాచ్‌తో పాటు తమ మాజీ టీమ్మేట్స్ గురించి క్రికెటర్ దినేశ్ కార్తిక్ ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఒకవేళ టీమ్ఇండియా ప్లేయర్స్‌పై బయోపిక్ తీస్తే అందులో ఎవరు నటిస్తే బాగుంటుందో అన్న ప్రశ్నకు కొన్ని సలహాలు చెప్పాడు.
"కోహ్లీపై బయోపిక్ తీస్తే బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తారని నా అభిప్రాయం. ఆయన క్రికెట్ ఆడటం నేనెప్పుడూ చూడలేదు కానీ, కోహ్లీ ఆటతీరును సరిగ్గా చేసి చూపించగలరని అనుకుంటున్నాను.శిఖర్ ధావన్‌గా అక్షయ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ పాత్రకు సునీల్ శెట్టి, హార్దిక్ పాండ్యా పాత్రలో రణ్‌వీర్ సింగ్, చాహల్‌పై సినిమా తీస్తే రాజ్‌పాల్ యాదవ్, బుమ్రా రోల్‌కైతే రాజ్ కుమార్ రావ్ బాగుంటారు. ఒకవేళ నాపై బయోపిక్ వస్తే, విక్రాంత్ మాస్సే ఆ పాత్రలో నటించాలని అనుకుంటున్నాను" అని డీకే అన్నాడు.
ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కరెక్ట్‌గా సెట్ అవుతున్నారని అన్నాడు. రిషభ్ పంత్‌పై సినిమా తీస్తే నేచురల్ స్టార్ నాని సరిగ్గా నప్పుతారంటూ చెప్పారు.
T20 Worldcup 2024 Super 8 : టీ20 ప్రపంచకప్ 2024 ఎనిమిది జట్లతో సూపర్ - 8 సమరం ప్రారంభం కానుంది. టీమ్ ఇండియా గురువారం(జూన్ 20) నుంచి తమ మ్యాచ్‌లను ప్రారంభించనుంది. గ్రూప్ - 1లో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో పోటీ పడనుంది. ఇందులో రెండు జట్లను తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే అవి ఇప్పటికే పెద్ద జట్లకు షాక్‌లు ఇచ్చాయి.
సూపర్ 8లో కుల్దీప్ ఎంట్రీ
కొందరు క్రికెట్ నిపుణుల ప్రకారం, సూపర్ 8 మ్యాచుల్లో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లో ఒకరు చోటు కోల్పోతారు. వెస్టిండీస్ పిచ్‌లు, గత రికార్డులను పరిశీలిస్తే జడేజా కంటే అక్షర్ మెరుగ్గా ఉన్నాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో జడేజాని తప్పించి కుల్దీప్‌ని ఎంపిక చేయవచ్చని భావిస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ మొదటి ఫైనలిస్ట్‌గా భారత్? స్టీఫెన్ ఫ్లెమింగ్ విశ్లేషణ ఇదే! - T20 World Cup 2024
టీమ్ఇండియా హెడ్ కోచ్ రేసులో కొత్త పేరు - ఇంటర్వ్యూ కూడా చేశారట! - TeamIndia New Head Coach