ETV Bharat / sports

ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్​?​ - కెప్టెన్‌ కూల్‌ చైల్డ్​హుడ్ ఫ్రెండ్​ ఏమన్నాడంటే?

Dhoni IPL 2024 : మహీకి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ధోనీ నుంచి కానీ, సీఎస్‌కే యాజమాన్యం నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్​మెంట్ లేదు. అయితే తాజాగా మహీ చిన్ననాటి స్నేహితుడు పరమ్‌జిత్‌ సింగ్‌ దీనిపై మాట్లాడారు.

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 8:34 PM IST

Updated : Mar 3, 2024, 10:04 PM IST

ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్​?​ - కెప్టెన్‌ కూల్‌ చైల్డ్​హుడ్ ఫ్రెండ్​ ఏమన్నాడంటే?
ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్​?​ - కెప్టెన్‌ కూల్‌ చైల్డ్​హుడ్ ఫ్రెండ్​ ఏమన్నాడంటే?

Dhoni IPL 2024 : ఐపీఎల్‌ 2024 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో చెన్నై సూపర్ కింగ్స్‌ - రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో(CSK vs RCB) పోటీ పడనుంది. అయితే గత రెండు మూడు సీజన్లుగా ఐపీఎల్ ప్రారంభానికి ముందు ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ చర్చ జరగడం కామన్ అయిపోయింది. అలానే ఈ సారి కూడా మహీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి జోరుగా వార్తలు వస్తున్నాయి. మహీకి ఇదే చివరి సీజన్‌ అనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయంపై ధోనీ నుంచి కానీ, సీఎస్‌కే యాజమాన్యం నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్​మెంట్ లేదు. గతేడాది కూడా ఇలాంటి మాటలే వినపడ్డాయి. కానీ మహీ బరిలోకి దిగి చెన్నైను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. తాజాగా మహీ చిన్ననాటి స్నేహితుడు పరమ్‌జిత్‌ సింగ్‌ దీనిపై కీలక విషయాన్ని చెప్పారు. ధోనీ ఫిట్‌నెస్‌ చూస్తుంటే ఇదే చివరి సీజన్‌ అని అస్సలు అనుకోలేం. ప్రస్తుత సీజన్‌తో పాటు అతడు కనీసం మరో రెండేళ్లు ఆడే అవకాశం ఉంది. దానికి కారణం అతడి ఫిట్‌నెస్‌ అని అన్నాడు.

Dhoni కాగా, కెరీర్‌ ప్రారంభంలో ధోనీకి బ్యాట్లను అందించిన స్నేహితుడే పరమ్‌జిత్‌. రీసెంట్​గా మహీ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి బ్యాట్‌పై ఓ అతికించిన ఓ స్టిక్కర్‌ బాగా వైరల్ అయింది. అదే ప్రైమ్‌ స్పోర్ట్స్‌ స్టిక్కర్. ఆ షాప్‌ ఓనరే పరమ్‌జిత్‌. మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఎంతో అద్భుతమైంది. అతడు సైన్​ చేసిన బ్యాట్‌ను నాకు గిఫ్ట్​గా ఇచ్చాడు. అవెంతో గర్వపడే క్షణాలు అని పరమ్‌జిత్‌ రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇకపోతే ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఐదు సార్లు ట్రోఫీని ముద్దాడింది. గతేడాది కూడా చెన్నై సూపర్ కింగ్సే టైటిల్​ను ఎగరేసుకుపోయింది. అలా మొత్తంగా ఐదు సార్లు దక్కించుకుంది. ఈ ఏడాది కూడా సీఎస్కేనే గెలవాలని ఆ జట్టు అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు.

గుజరాత్ టైటాన్స్​కు మరో షాక్​ - ఆ జట్టు ప్లేయర్​కు రోడ్డు ప్రమాదం!

రంజీ ట్రోఫీ సెమీఫైనల్​ - శార్దూల్, హిమాన్షు అద్భుత శతకాలు

Last Updated : Mar 3, 2024, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.