Dhoni IPL 2024: 2024 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లకు స్టేడియాలు ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. స్టార్ ప్లేయర్ ఎమ్ ఎస్ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ స్టేడియాలకు క్యూ కడుతున్నారు. వేదిక ఏదైనా ధోనీ ధోనీ నినాదంలో మైదానాలు మార్మోగిపోతున్నాయి. ధోనీ క్రీజులోకి దిగి ఒక్క బంతి ఆడినా చాలు అనుకునే వాళ్లు చాలానే ఉన్నారు.
ఈ క్రమంలో ధోనీ కూడా ప్రస్తుత సీజన్లో అవకాశం ఉన్నప్పుడల్లా బ్యాటింగ్‌కు వచ్చి ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. 42ఏళ్ల ధోనీ మెరుపు హిట్టింగ్తో స్టేడియాలను ఉర్రూతలూగిస్తున్నాడు. ఇటీవల ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ 4 బంతుల్లోనే 500 స్ట్రైక్ రేట్‌తో 20 పరుగులు బాది ఔరా అనిపించాడు. అందులో వరుసగా మూడు సిక్స్‌లు బాదడం మరో విశేషం.
ఇక తాజాగా లఖ్‌నవూతో మ్యాచ్‌లోనూ ధోనీ మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్ రెచ్చిపోయాడు. ఈసారి 311.11 స్ట్రైక్ రేట్‌తో ఆడి 9 బంతుల్లోనే 28 పరుగులు బాదాడు. అందులో మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. చివరి ఓవర్లోనే ధోనీ 16 పరుగులు పిండుకున్నాడు. ముఖ్యంగా ధోనీ బాదిన 101 మీటర్ల సిక్స్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక ప్రస్తుత సీజన్లో 5 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ 255.88 స్ట్రైక్ రేట్‌తో 87 పరుగులు నమోదు చేశాడు. ఇక ఇదే సీజన్లో చెన్నై ఇంకా 7 లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దీంతో ధోనీ మున్ముందు కూడా ఇదే జోష్ కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Dhoni IPL 20th Over: క్రికెట్లో బెస్ట్ ఫినిషషర్గా పేరున్న ధోనీ ఐపీఎల్‌లోనూ డెత్ ఓవర్లలో అదరగొడుతున్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకూ 20వ ఓవర్లోనే 246.64 స్ట్రైక్ రేట్‌తో 772 పరుగులు బాదాడు. అందులో 53 ఫోర్లు ఉండగా, 65 సిక్స్‌లు ఉండడం విశేషం.
ధోనీ అరుదైన ఘనత: ఈ మ్యాచ్‌లో ధోనీ ఓ అరుదైన ఘనత అందుకున్నాడు. వికెట్ కీపర్‌గా 5000 పరుగులు పూర్తి చేసుకొని ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక ఐపీఎల్లో ఇప్పటివరకూ 257 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 5169 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
-
MS DHONI SMASHED 101 METER SIX 🤯🐐 pic.twitter.com/IpCffz04AI
— Johns. (@CricCrazyJohns) April 19, 2024
ధోనీ హ్యాట్రిక్ సిక్స్‌లు - రోహిత్ సెంచరీ వీడియో - IPL 2024 CSK VS Mumbai Indians
లాస్ట్ ఓవర్లో ధోనీ ధమాకా- 3 సిక్స్‌లు ఎన్నిసార్లు బాదాడంటే? - Dhoni 3 Sixes IPL