DC Vs RR IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా తాజాగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని అందుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో 20 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచింది. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. దీంతో నిర్దాక్షిణ్యంగా బ్యాట్‌తో విరుచుకుపడిన సంజు శాంసన్ పోరాటం వృథా అయింది. అసాధారణ రీతిలో పోరాడుతూ అతడు వివాదాస్పద రీతిలో ఔట్ అవ్వడంతో మ్యాచ్ మలుపు తిరిగి దిల్లీ పైచేయి సాధించింది.
222 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 8 వికెట్లకు 201 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ సంజు శాంసన్ (86; 46 బంతుల్లో 8×4, 6×6) ఒక్కడే తన బ్యాట్‌ను ఝళిపించాడు. ఓపెనర్ జైస్వాల్(4) తక్కువ పరుగులకే ఔటైనా సంజూ దుమ్ము దులిపేశాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఖలీల్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్‌ల బౌలింగ్‌ను బెంబేలెత్తించాడు. కానీ 86 పరుగుతో దూకుడుగా ఉన్న సంజూను ముకేశ్ కుమార్ ఔట్ చేశాడు. అక్కడి నుంచి దిల్లీ జట్టు పట్టు బిగించింది. రియాన్ పరాగ్(27), దూబె(25), బట్లర్(19) పరుగులు చేశారు. ఈ క్రమంలోనే ఆఖరి ఓవర్లో విజయానికి రాజస్థాన్ టీమ్‌కు 29 పరుగులు అవసరమయ్యాయి. అయితే 20వ ఓవర్ మొదటి బాల్‌కు ఒక్క పరుగే ఇచ్చిన ముకేశ్ సెకండ్ బాల్‌కు పావెల్ (13)ను బౌల్డ్ చేయడం వల్ల దిల్లీ విజయం ఖాయమైపోయింది. కుల్‌దీప్ యాదవ్ (2/25), ఖలీల్, ముకేశ్ తలో రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ ప్లేయర్లు చాకచక్యంగా ఆడి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేశారు. అభిషేక్ పోరెల్ (65), జేక్ ఫ్రెసర్(50) ట్రిస్టన్ స్టబ్స్(41) తమ ఇన్నింగ్స్‌లో రాణించి జట్టుకు మంచి స్కోర్ అందించారు. ఇక షై హోప్ (1), అక్షర్ పటేల్ (15), రిషభ్ పంత్ (15), గుల్బదిన్ నాయిబ్ (19), రసిఖ్‌దార్ సలాం (9), కుల్‌దీప్ యాదవ్ (5*) ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ పడగొట్టారు.
-
You asked for it, we (Mukesh & Admin) delivered 😉 pic.twitter.com/UiGYgKLuQ3
— Delhi Capitals (@DelhiCapitals) May 7, 2024
ధోనీ నెం.9లో ఎందుకు వచ్చాడంటే? - అసలు రీజన్ ఇదే - IPL 2024 CSK