David Warner T20 Retirement: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సొంత గడ్డపై ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. మంగళవారం పెర్త్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచే అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా గడ్డపై వార్నర్‌కు చివరిదైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన వార్నర్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. సుదీర్ఘ కాలం ఓపెనర్‌గా రాణించిన వార్నర్, టీ20 వరల్డ్‌కప్ తర్వాత యంగ్ ప్లేయర్ల కోసం ఆ స్థానాన్ని సంతోషంగా ఖాళీ చేస్తానని అన్నాడు.
'నా కెరీర్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా. 2024 టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఓపెనింగ్ స్థానాన్ని కుర్రాళ్ల కోసం సంతోషంగా ఖాళీ చేస్తా. యంగ్ ప్లేయర్లు వాళ్ల సత్తా చూపించాల్సిన సమయం వచ్చింది. మేం నెక్ట్స్ న్యూజిలాండ్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ తర్వాత నాకు ఖాళీ సమయం దొరుకుతుంది. ఆ టైమ్‌లో ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడతా. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్ కోసం వెస్టిండీస్‌కు వెళ్లాలి' అని వార్నర్ అన్నాడు.
మంగళవారం జరిగిన ముడో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 37 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్ నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం ఛేదనలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ వార్నర్ (81 పరుగులు) హాఫ్ సెంచరీకి తోడు చివర్లో టిమ్ డేవిడ్ (41 పరుగులు) మాత్రమే రాణించాడు.
ఈ సిరీస్‌లో వార్నర్ అద్భుతంగా రాణించాడు. వరుసగా 70, 22, 81 స్కోర్లు నమోదు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికయ్యాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 2-1తో నెగ్గింది. ఇక ఇప్పటికే వన్డే, టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ 2024 టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి క్రికెట్‌కు కూడా దూరం కానున్నాడు. ఆ తర్వాత వార్నర్ డొమెస్టిక్ టోర్నీల్లో ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేయనున్నాడు.
-
David Warner has revealed details about his plans to retire from T20I this year 😲https://t.co/N8NHIAt6xw
— ICC (@ICC) February 13, 2024
సొంతగడ్డపై అరుదైన రికార్డు - టీ20ల్లో 12 వేల పరుగుల మైల్స్టోన్ దాటిన వార్నర్