ETV Bharat / sports

సొంతగడ్డపై అరుదైన రికార్డు - టీ20ల్లో 12 వేల పరుగుల మైల్​స్టోన్ దాటిన వార్నర్ - టీ20ల్లో డేవిడ్ వార్నర్ రికార్డు

David Warner 3rd T20 Series : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తాజాగా తన ఖాతాలో ఓ అరుదైన రికార్డును వేసుకున్నాడు. ఇంతకీ అదేంటంటే ?

David Warner  3rd T20 Serie
David Warner 3rd T20 Serie
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 10:28 PM IST

David Warner 3rd T20 Series : ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సొంతగడ్డపై ఆడిన ఆఖరి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పెర్త్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం ముగిసిన ఆఖరి టీ20లో ఈ రికార్డును సాధించాడు. 49 బంతుల్లోనే 81 పరుగులు చేసిన వార్నర్‌, పొట్టి ఫార్మాట్‌లో 12 వేల పరుగులు పూర్తిచేసిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా నిలిచాడు. మూడో టీ20కి ముందు 48 పరుగుల దూరంలో ఉన్నాడు. కానీ ఈ మ్యాచ్‌లో 81 పరుగులు చేయడం వల్ల అతడు 12 వేల పరుగుల మైల్​స్టోన్​ను దాటాడు.

మరోవైపు ఈ లిస్ట్​లో ఓవరాల్‌గా ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్న వార్నర్​ ఉన్న ఆస్ట్రేలియా నుంచి మాత్రం ఈ ఘనతను సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. ఇప్పటికే ఈ జాబితాలో షోయభ్‌ మాలిక్‌, క్రిస్‌ గేల్‌, కీరిన్‌ పొలార్డ్‌, అలెక్స్‌ హేల్స్‌లు ఉన్నారు. అయితే 343 మ్యాచ్‌లలో క్రిస్‌ గేల్‌ ఈ ఘనతను అందుకోగా, డేవిడ్ వార్నర్‌ 368 మ్యాచల్లో దీన్ని సాధించాడు. ఇక అలెక్స్‌ హేల్స్‌ (435 మ్యాచ్‌లు), షోయభ్‌ మాలిక్‌ (486)లు ఆ తర్వాతి స్థానాలను సొంతం చేసుకున్నారు.

Aus Vs WI 3rd T20 : ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 220 పరుగులకు ఆలౌటైంది. జట్టు తరపున అద్భుతమైన ఇన్నింగ్స్​ అందించిన షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులు స్కోర్​ చేశాడు. ఇక రోస్టన్ చేజ్ కూడా 37 పరుగులు చేశాడు. అయితే ఈ లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైంది. ఆసీస్​ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (81), టిమ్‌ డేవిడ్‌ (41*), ​ తప్ప మిగతా ఎవరూ గట్టి స్కోర్ చేయలేకపోయారు. మ్యాక్స్‌వెల్‌ (12) సహా, హిట్టర్లు మిచ్‌ మార్ష్‌ (17), ఆరోన్‌ హార్డీ (16) కూడా తమ ఇన్నింగ్స్​లో విఫలమయ్యారు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆసీస్‌ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే ఆస్ట్రేలియా జట్టు చేయగలిగింది.

డేవిడ్ భాయ్ వరల్డ్ రికార్డ్- ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్​

ఖరీదైన కార్లు, లగ్జరీ లైఫ్- వార్నర్ నెట్​వర్త్ ఎంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.